సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి  బిగ్ షాక్ తగిలింది.  అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన  పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యనించింది.  కేసు దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.   ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు ఏపీ హైకోర్టు  2024 జనవరి 10న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా...   దీనిపై ఇవాళ జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ దీపాంకార దత్తతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  

చంద్రబాబు హయాంలోఅమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ పేరిట జరిగిన భారీ అవినీతి దర్యాప్తులో వెలుగు చూసింది. ఏ-1గా చంద్రబాబు నాయుడు పేరును, ఏ-2గా మాజీ మంత్రి నారాయణ పేరును ఈ కేసులో చేర్చింది