
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ తీసుకొచ్చిన బిల్లును పాట్నా హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగం ప్రకారం మొత్తం అందరి రిజర్వేషన్లు కలిపి 60 శాతం మించకూడదు.. కానీ బీహార్ ప్రభుత్వ ఈ నిర్ణయంతో రిజర్వేషన్లు 75 శాతానికి చేరుతున్నాయి. దీంతో రిజర్వేషన్లు పెంచడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది పాట్నా హైకోర్టు. రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో నితీష్ ప్రభుత్వం తరుపున న్యాయవాది సుప్రీ కోర్టును ఆశ్రయించారు.
పాట్నా హైకోర్టు తీర్పుపై బీహార్ ప్రభుత్వం దాఖలు చేసిన కనీసం 10 పిటిషన్లను విచారించేందుకు సుప్రీ కోర్టు ధర్మాసనం అంగీకరించింది. పాట్నా హైకోర్టు రిజర్వేషన్ బిల్లును రద్దు చేయడాన్ని సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్లపై నోటీసులు కూడా జారీ చేయని అత్యున్నత న్యాయస్థానం సోమవారం అప్పీలుకు అనుమతిని మంజూరు చేసింది. ఈ కేసును పై వేసిన పిటిషన్లను సెప్టెంబర్‌లో విచారిస్తామని సోమవారం సుప్రీం కోర్టు లిస్ట్ చేసింది.