జీవో నెం.1పై జోక్యం చేసుకోలేం: సుప్రీం

జీవో నెం.1పై జోక్యం చేసుకోలేం: సుప్రీం

రోడ్ షోలు, సభలు, సమావేశాలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్ 1పై జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈ నెల 23న ఏపీ హైకోర్టు దీన్ని విచారణ జరపాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ కేసును విచారించాలని చెప్పింది. 

ఏపీలో రోడ్డు షోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం జీవో1 ను తెచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయించగా జీవోను నిలిపివేస్తూ స్టే విధించింది. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఇవాళ పిటిషన్‌ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ..  ప్రస్తుతం జీవో1పై జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈ నెల 23న ఏపీ హైకోర్ట్ ధర్మాసనం ఈ కేసును విచారణ  జరపాలని  ఆదేశించింది. ఆ ధర్మాసనం ముందే అన్ని అంశాలను ప్రస్తావించాలని సూచించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మెరిట్స్  పై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని చెప్పింది.