కరోనా పరిహారం ఎంతివ్వాలని మేం చెప్పలేం

కరోనా పరిహారం ఎంతివ్వాలని మేం చెప్పలేం

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై 6 వారాల్లోగా గైడ్ లైన్స్ ఇవ్వాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఆదేశించింది సుప్రీం కోర్టు. ఎంతివ్వాలనేదిపై తాము ఆదేశించలేం కానీ... బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగేలా ఎంతో కొంత పరిహారం ఇవ్వాలని చెప్పింది. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 4 లక్షల పరిహారం ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. బాధిత కుటుంబాలకు ఎంతివ్వాలనేది ప్రభుత్వమే చర్చించి ఆదుకోవాలని కోరింది. పరిహారం ఎంత ఇవ్వాలనే నిర్ణయాన్ని NDMA కు ఇస్తున్నామని తెలిపింది. తాము సూచనలకు అనుగుణంగా గైడ్ లైన్స్ ఉండాలని కేంద్రానకి ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు.