రోహింగ్యాలు శరణార్థులా? చొరబాటుదారులా? : సుప్రీంకోర్టు

రోహింగ్యాలు శరణార్థులా? చొరబాటుదారులా? : సుప్రీంకోర్టు
  • క్లారిటీ వస్తేనే సమస్యను పరిష్కరించగలం

న్యూఢిల్లీ: రోహింగ్యాల విషయంలో క్లారిటీ వస్తే తప్ప వారి సమస్యను తేల్చలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అందుకే రోహింగ్యాలు  శరణార్థులా, లేక చొరబాటుదారులా అన్నది ముందుగా తేలుస్తామని జస్టిస్  సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్  దత్తా, జస్టిస్ కోటీశ్వర్  సింగ్ ల బెంచ్ వెల్లడించింది. దేశంలో ఉంటున్న రోహింగ్యాలకు సంబంధించి దాఖలైన  పిటిషన్లపై బెంచ్  గురువారం విచారణ జరిపింది. ‘‘రోహింగ్యాలు రెఫ్యూజీలా? లేక చొరబాటుదారులా?  శరణార్థులుగా ప్రకటించేందుకు  అర్హులా? 

 శరణార్థులైతే, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? చొరబాటుదారులైతే.. కేంద్రం, రాష్ట్రాలు వారిని డిపోర్టు చేస్తున్నాయా? లేదా? అక్రమ వలసదారులైనా.. వారిని క్యాంపుల్లో నిరవధికంగా బంధించవచ్చా?” అన్న ప్రశ్నలకు సమాధానాలు వస్తేనే తదనంతరం సమస్యను పరిష్కరించొచ్చని   బెంచ్  పేర్కొంది.