
సుప్రీంకోర్టులో తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కేసు విచారణ జరిగిన తర్వాతే.. ఆ విషయంలో ముందుకు వెళ్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు- 2017లో హోంశాఖకు చేరింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కేసు పెండింగ్ లో ఉంది. ఆ కేసు పరిష్కారం అయిన తర్వాతే తెలంగాణ రిజర్వేషన్ల బిల్లును ప్రాసెస్ చేస్తామని కేంద్రం చెబుతోంది.
తెలంగాణలో 10% ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా? అంటూ టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు.. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఆయన చెప్పారు. అయితే.. జనాభా ప్రాతిపదికన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని.. తెలంగాణ హైకోర్టు గతంలో తీర్పు నిచ్చింది. ఇక ప్రస్తుతం బీసీ,ఎస్టీ, ఎస్టీలకు రిజర్వేషన్ విషయంలో 27 శాతం మాత్రమే అమలు చేస్తున్నారు.