నీట్ కౌన్సెలింగ్ వాయిదాకు సుప్రీం నో 

నీట్ కౌన్సెలింగ్ వాయిదాకు సుప్రీం నో 

న్యూఢిల్లీ: నీట్-యూజీ కౌన్సెలింగ్‌‌‌‌ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కౌన్సెలింగ్‌‌‌‌ అనేది హఠాత్తుగా ఓపెన్ అండ్ షట్ చేసేది కాదని వ్యాఖ్యానించింది. నీట్-యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని..పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ విక్రమానాథ్, జస్టిస్ ఎస్పీఎన్ భట్టీతో కూడిన వెకేషన్ బెంచ్ శుక్రవారం విచారించింది. 

పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌‌‌టీఏ), కేంద్రం, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఈ పిటిషన్‌‌‌‌పై తమ సమాధానాన్ని దాఖలు చేయాలని ఆదేశించింది. కొత్తగా దాఖలైన పిటిషన్లతోపాటు పెండింగ్‌‌‌‌లో ఉన్న ఇతర పిటిషన్ల విచారణను జూలై 8కి వాయిదా వేసింది.