ఢిల్లీలో వాయుకాలుష్యపై సుప్రీం సీరియస్

ఢిల్లీలో వాయుకాలుష్యపై సుప్రీం సీరియస్

ఢిల్లీలో వాయుకాలుష్య నియంత్రణ చర్యలపై  సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. పరిశ్రమల మూసివేతతో రాష్ట్రంలో చెరకు, పాడిపరిశ్రమపై ప్రభావం పడుతోందని సుప్రీం కోర్టుకు యూపీ ప్రభుత్వం తెలిపింది. యూపీ దిగువగా ఉన్నందున పాకిస్థాన్ నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పింది.. దీనిపై స్పందించిన ఎన్వీ రమణ ధర్మాసనం పాకిస్థాన్ లోని పరిశ్రమలు మూసివేయమంటారా అని ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో తెలియదు కానీ..ఓ వర్గం మీడియా కోర్టును విలన్లు చేసే ప్రయత్నం చేస్తుందని ధర్మాసనం తెలిపింది. పాఠశాలలు మూసివేతపై సుప్రీం కోర్టు ఆర్డర్స్ ను తప్పుగా ప్రచురిస్తున్నాయని మండిపడింది. కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నామని.. ఆస్పత్రుల నిర్మాణం కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఢిల్లీ సర్కార్ సుప్రీం కోర్టును కోరింది.  తదుపరి విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. 

వాయుకాలుష్యం నియంత్రించేందుకు చర్యలు చేపట్టినట్లు అంతకు ముందు కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. నిబంధనలు పాటించేలా ఫ్లయింగ్ స్కాడ్ లను ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ ను ఏర్పాటు చేసిందని తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.