
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయంపై సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు
చేయాలని ఆదేశించింది. సంబంధిత పిటిషన్ ను తొలుత హైకోర్టుతో దాఖలు చేయగా.. హైకోర్టు దానిని తోసిపుచ్చిన నేపథ్యం లో దాన్ని సవాలు చేస్తూ నాగం సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం జస్టిస్ ఎస్.ఎ.జాబ్డే నేతృత్వం లోని ధర్మాసనంవద్దకు పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తి-పోతల పథకంలోని ప్యాకేజీ 1, 5, 8, 16 పనుల అంచనా వ్యయాన్ని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా రూ.5,960,79 కోట్లుగా మందించగా ..తెలంగాణ ప్రభుత్వం బీహెచ్ ఈఎల్, మేఘా ఇంజ-నీరిం గ్ ఇన్ఫ్రా లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్కంపె నీ లిమిటెడ్ సంస్థలతో కుమ్మక్కై అంచనా-లను అదనంగా రూ. 9,386 కోట్లకు పెంచిం దనిఆరో పించారు. దీని ద్వారా ప్రభుత్వ ఖాజనాకురూ. 2,426 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. అలాగే మోటారు పంపు సెట్లకు అధిక మొత్తం రేటుగా చూపి యంత్రాలు డిజైన్ చేసి సరఫరా చేసిన బీహె-చ్ఈఎల్ కంటే అదనంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెల్లిం చారని, ప్యాకేజీ -5లో ఒక పంపు సెట్‌కు రూ.92 కోట్లు, ఒక మోటరుకు రూ. 87 కోట్లుగాలెక్కించి 9 పంపు మోటరు సెట్లకు రూ.179 కోట్లచొప్పున రూ.1611 కోట్ల చెల్లిం పునకు ప్రభుత్వంఆమోదం తెలిపిందన్నారు. అయితే చెల్లిం పుల బ్రేకప్ లో మాత్రం బీహెచ్ఈఎల్ కు రూ. 803కోట్లు చెల్లిం చి.. మిగిలిన రూ.808 కోట్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చూపారని, వాస్తవానికి ఇక్కడ అయిన ఖర్చు రూ.803 కోట్లు మాత్రమేననికోర్టు దృష్టికి తెచ్చారు. ఇక సివిల్ పనులకు మరోరూ. 1459 కోట్లుగా చూపారని, అంటే యంత్రాల ఖర్చు కంటే సివిల్ వనులకు అదనంగా వెచ్చించారని పేర్కొ న్నారు. ప్యాకే జీ 1, 16 లో బీహెచ్ఈఎల్–మేఘా సంస్థ 145 మెగావాట్ల మోటరుకు రూ. 38కోట్లు కోట్ చేసిందని, నవయుగ సంస్థ 40 కోట్లకు కోట్ చేసిందని, కానీ ప్రభుత్వం 145 మెగావాట్లమోటారుకు రెండు సంస్థలకు రూ. 87 కోట్లుగా ఆమోదించిం దని తెలిపారు. అంటే దాదాపు రూ.50 కోట్లు పెంచిం దని, వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీహైకోర్టు వీటిని విస్మరించిం దని వాదించారు. దీంతోధర్మాసనం పిటిషన్ ను స్వీకరిస్తున్నట్లు పేర్కొంది.
ప్రాజెక్టు స్వరూపమే అది: రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. సంబంధి త అంశంపై పిటిషనర్ 4పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు రెండిం టినికొట్టేసిందని, మరో రెండు పెండింగ్ లో ఉన్నాయని ధర్మాసనానికి నివేదించారు. యంత్రాల ఖర్చుకంటే సివిల్ పనులకు ఎక్కువ వ్యయం అవడంలోఆశ్చర్యం లేదని, ప్రాజెక్టు స్వరూపమే ఎత్తిపోతలప్రాజెక్టు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా,గోదావరి నదులపై ఆధారపడి నీటిని ఎత్తిపోయాల్సిఉంటుందని తెలిపారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కూడా సంబంధి త ఆరోపణలను తోసిపుచ్చిందని పే-ర్కొ న్నారు. జస్టిస్ ఎస్.ఎ బాబ్డే స్పంస్తూ..ప్రభుత్వవాదనలు కూడా వింటామని, అంకెలు అసాధారణరీతిలో కనిపిస్తున్నాయని పేర్కొ న్నారు. ‘‘ప్రభుత్వకాంట్రాక్టుల్లో నే ఇలాంటివి ఎందుకు జరుగుతు-న్నాయి. మీరు కరెక్టే కావొచ్చు. పిటిషన్లను హైకోర్టుకొట్టేసి ఉండొచ్చు. కానీ, అంకెలు అసాధారణ రీతిలోఉండటాన్ని ప్రస్తావించలేదు కదా” అని అన్నారు.బీహెచ్ఈఎల్ తరఫు అడ్వొకెట్ ను ప్రశ్ని స్తూ.. ఒకవేళ బీహెచ్ఈఎల్ సంస్థ తాను సరఫరా చేసిన పం-పుసెట్లు, మోటారు సెట్లు అమర్చడంతోపాటు సివిల్పనులు చేపట్టి ఉంటే ఎంత వసూలు చేసేది అని ప్రశ్నిం చారు. ఖర్చు మదింపు చేయాల్సి ఉంటుం దనిఅడ్వొకేట్ బదులిచ్చా రు. కేసు విచారణను ఏప్రిల్ 26 కు ధర్మాసనం వాయిదా వేసింది.
‘‘రాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా వింటాం .పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనావ్యయంలో అంకెలు చూస్తుం టే అసాధారణరీతిలో కనిపిస్తు న్నాయి. ప్రభుత్వకాంట్రాక్టుల్లో నే ఇలాం టివి ఎందుకుజరుగుతున్నాయి? మీరు కరెక్టే కావొచ్చు.కానీ ఈ కేసును మేం విచారిస్తాం ’’ – సుప్రీంకోర్టు