సోమశిల టు శ్రీశైలం క్రూయిజ్ లాంచీ షురూ..65 మంది పర్యాటకులతో బయల్దేరిన పడవ

సోమశిల టు శ్రీశైలం క్రూయిజ్ లాంచీ షురూ..65 మంది పర్యాటకులతో బయల్దేరిన పడవ

కొల్లాపూర్, వెలుగు: నాగర్ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని వీఐపీ పుష్కర ఘాట్​ నుంచి శ్రీశైలం క్షేత్రానికి క్రూయిజ్​ లాంచీ సేవలు పున:ప్రారంభమయ్యాయి. శనివారం తెలంగాణ టూరిజం ఈ లాంచీని ప్రారంభించగా 65 మంది ప్రయాణికులు శ్రీశైలంకు ప్రయాణించారు. పర్యాటక శాఖ అధికారులు, స్థానిక సీఐ మహేశ్, ఎస్సై హృషికేష్  జెండా ఊపి లాంచీని ప్రారంభించారు. 

హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల నుంచి ఎకో టూరిజం స్పెషల్​ బస్సులో సోమశిలకు పర్యాటకులు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎత్తైన కొండల మధ్య, గలగల ప్రవహించే కృష్ణమ్మ ఒడిలో లాంచీ ప్రయాణం ద్వారా శ్రీశైలం బయల్దేరారు. ఈ కార్యక్రమంలో టూరిజం యూనిట్ ఇన్​చార్జి ప్రేమ్ కుమార్, డిప్యూటీ మేనేజర్ ప్రభుదాస్ పాల్గొన్నారు.