కొత్త సీవీసీగా సురేశ్ ఎన్ పటేల్

కొత్త సీవీసీగా సురేశ్ ఎన్ పటేల్

న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా సురేశ్ ఎన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య  తదితరులు హాజరయ్యారు. ఆంధ్రాబ్యాంక్ మాజీ ఎండీ అండ్ సీఈవో అయిన పటేల్ ఏప్రిల్ 2020లో విజిలెన్స్ కమిషనర్ గా నియమితులయ్యారు.

ఇంతకుముందు సీవీసీగా ఉన్న సంజయ్ కొఠారి పదవీ కాలం నిరుడు జూన్ 23న ముగిసింది. దీంతో విజిలెన్స్ కమిషనర్​గా ఉన్న పటేల్ అప్పటి నుంచి యాక్టింగ్ సీవీసీ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ పోయిన నెలలో పటేల్​ను పూర్తిస్థాయి సీవీసీగా ఎంపిక చేసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్​లో రెండు విజిలెన్స్ కమిషనర్ పోస్టులు కూడా ఖాళీగా ఉండగా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ అర్వింద్ కుమార్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ  ఆ పోస్టుల్లో నియమితులయ్యారు.