
చైనా వైద్య శాస్త్రం ఒక గొప్ప మైలురాయిని సాధించింది. డాక్టర్లు మొదటిసారిగా జన్యుపరంగా మార్పు చేసిన పంది ఊపిరితిత్తుని(lung) మనిషికి విజయవంతంగా మార్పిడి చేశారు. ఈ మార్పిడి మెదడు చనిపోయిన వ్యక్తికి చేసారు. ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే పంది ఊపిరితిత్తులు మనిషి శరీరంలో తొమ్మిది రోజులు పనిచేశాయి.
గతంలో పంది మూత్రపిండాలు, గుండెని మనిషికి మార్పిడి చేసిన ప్రయత్నాలు కొంత విజయవంతమయ్యాయి, ఇప్పుడు మొదటిసారి పంది ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతమైందని సూచిస్తుంది. డాక్టర్ల ప్రకారం ఓ 39 ఏళ్ల వ్యక్తికి మెదడులో రక్తస్రావం కారణంగా బ్రెయిన్ డెడ్ అయ్యింది. దింతో కుటుంబ అనుమతితో అతనికి ఊపిరితిత్తుల మార్పిడి నిర్వహించారు.
వైద్య శాస్త్రంలో ఒక కొత్త విజయం: ఈ మార్పిడికి ముందు పంది ఊపిరితిత్తులకు ఆరు జన్యు సవరణలు జరిగాయి, ఇంకా పందిని చాలా శుభ్రంగా, సురక్షితమైన వాతావరణంలో పెంచారు. ఇన్ఫెక్షన్ లేదా ప్రమాదాన్ని తగ్గించడానికి రోగికి కొన్ని మందులు కూడా ఇచ్చారు. మొదట్లో ఊపిరితిత్తులు బాగా పనిచేశాయి, కానీ ఒక రోజు తర్వాత సమస్యలు తలెత్తాయి. దింతో రోగికి ద్రవం పేరుకుపోవడం, వాపు వచ్చింది. ఊపిరితిత్తులు మొదట్లో కొంత కోలుకున్నట్లు చూపించిన, శరీరం మెల్లిగా పంది అవయవానికి సహకరించకపోవడం ప్రారంభించింది.
మనిషి శరీరంలో పంది ఊపిరితిత్తులు: పంది ఊపిరితిత్తులను మనిషిలోకి మార్పిడి చేయడం సాధ్యామేనని ఈ అధ్యయనం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు, అయితే చాల సవాళ్లు ఉన్నాయి. అవయవం సహకరించకపోవడం, ఇన్ఫెక్షన్ అతిపెద్ద అడ్డంకులను కలిగిస్తాయి. ఊపిరితిత్తులు క్లిష్టమైన అవయవాలు ఎందుకంటే అవి శ్వాసప్రక్రియకు మాత్రమే కాకుండా రక్తాన్ని ఫిల్టర్ చేయడం, శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడం, pH స్థాయిలను నిర్వహించడం, ప్లేట్‌లెట్లను ఉత్పత్తి చేయడం, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడం చేస్తాయి. గాలిలో వైరస్‌లు, బ్యాక్టీరియా అవి ప్రత్యక్షంగా ప్రభావం చూపడం వల్ల మార్పిడి సవాలుగా మారుతుంది.
ALSO READ : ChatGPT చెప్పిందని చేసాడు, ఆసుపత్రిలో పడ్డాడు
అయితే 2023లో ఒక్క యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే దాదాపు 1 లక్ష 3 వేల మంది అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పటికి 48 వేల మంది మాత్రమే అవయవ మార్పిడి పొందారు. అవయవ కొరత కారణంగా రోజుకు సుమారు 13 మంది మరణిస్తున్నారు. పందుల నుండి వచ్చే అవయవాల వంటి జంతువుల అవయవాలను ఉపయోగించడంపై ఈ పరిశోధనలను ముందుకు తెస్తోంది. పంది ఊపిరితిత్తులు మానవులకు ఇంకా పూర్తిగా విజయవంతమైన మార్పిడి కాకపోవచ్చు, అయితే స్టెమ్ సెల్ టెక్నాలజీ & జన్యు సవరణలో భవిష్యత్తులో పురోగతులు లేదా మానవ కణాలతో నిర్మాణాత్మక స్కాఫోల్డ్‌గా పంది ఊపిరితిత్తులను ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.