Karuppu Box Office: సూర్య బాక్సాఫీస్ గర్జన.. ‘కరుప్పు’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

Karuppu Box Office: సూర్య బాక్సాఫీస్ గర్జన.. ‘కరుప్పు’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

సూర్య నటించిన ‘కరుప్పు’ మూవీ బాక్సాఫీస్ వద్ద పవర్‌ఫుల్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. మొదట మే 14న విడుదల కావాల్సిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, చివరి నిమిషంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో షోలు రద్దయ్యాయి. ఈ క్రమంలోనే సినిమా విడుదల ఒక రోజు ఆలస్యంగా మే 15న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ ఆటంకాలతో ఎలాంటి ప్రభావం లేకుండా, ‘కరుప్పు’ తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.15.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం తొలి రోజే ఇండియాలో రూ.17.93 కోట్ల గ్రాస్, రూ.15.50 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది. విదేశాల్లో మరో రూ.4 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా కరుప్పు ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.21.93 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 4,891 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమా 50.35 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయగా, ముఖ్యంగా నైట్ షోలకు భారీ స్పందన లభించింది. అయితే సూర్య కెరీర్ బెస్ట్ ఓపెనర్ ‘కంగువ’ (రూ.22 కోట్ల నెట్) రికార్డును మాత్రం ‘కరుప్పు’ దాటలేకపోయింది.

అంతేకాదు.. ఈ వసూళ్లు సూర్య గత చిత్రం ‘రెట్రో’ ఓపెనింగ్ రికార్డును కూడా దాటలేకపోయింది. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ‘రెట్రో’ మూవీ తొలి రోజే 5,453 షోల ద్వారా రూ.19.25 కోట్ల నెట్ వసూలు చేసింది. అయినప్పటికీ, ‘కరుప్పు’సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో, వీకెండ్‌లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కరుప్పు విషయానికి వస్తే,

సూర్య ‘కరుప్పు’ అవతారంలో కనిపించే ప్రతి సన్నివేశం పాత్రకు ప్రత్యేకమైన ఎలివేషన్ ఇస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ‘వీరభద్రుడు’ పాత్రను సూర్య తన భుజాలపై మోశాడని, ముఖ్యంగా ఫస్టాఫ్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. దర్శకుడు తండ్రీకూతుళ్ల భావోద్వేగ కథతో సినిమాను మొదలుపెట్టి, దొంగతనానికి గురైన సొత్తు రికవరీ కేసును పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు తీసుకెళ్తాడు.

అక్కడ లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) పాత్రను పరిచయం చేస్తూ, తన తెలివితేటలు, కుయుక్తులతో కేసులు ఎలా గెలుస్తాడు, పోలీసులను ఎలా తన దారికి తెచ్చుకుంటాడో చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు. ఇక సెకండాఫ్‌లో వచ్చే దైవిక నేపథ్యంతో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ కోసం పరమాత్మ భూమిపై అవతరిస్తాడని చెప్పిన మెసేజ్ ఆకట్టుకుంటోంది.