సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన తమిళ చిత్రం ‘కరుప్పు’. తెలుగులో ‘వీర భద్రుడు’ టైటిల్‌లో విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ అందుకుందని మేకర్స్ తెలియేశారు. మే 14న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ రవి కీలక పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై బజ్‌ను పెంచాయి
