
- సీఎం టూర్ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల కదలికలపై ఆరా
నిర్మల్, వెలుగు: నిర్మల్ లో ఈ నెల 4న జరిగే సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లాపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టినట్టు సమాచారం. సీఎం పర్యటన సందర్భంగా రైతులు, విపక్షాలు ఆందోళనలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. గతకొద్ది రోజుల నుంచి నిర్మల్ జిల్లాలో రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోవడం, కొనుగోలు కేంద్రాలలో ఆలస్యం అవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
దీంతో మండలాల వారీగా కాంగ్రెస్, బీజేపీ నాయకులపై, రైతులపై నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. సీఎం టూర్ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ లీడర్ల ముందస్తు అరెస్ట్లు ఉండనున్నట్టు తెలుస్తోంది. కొత్త కలెక్టరేట్ సమీపంలోని ఎల్లపల్లి ప్రాంతంలో నిర్వహించనున్న సీఎం కే సీఆర్ బహిరంగ సభ దగ్గర, హైవే నుంచి కలెక్టరేట్ కు వెళ్లే రోడ్డు పై, టౌన్ లోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలస్తోంది.