సూర్య ఏంటి ఇలా అయ్యాడు.. అసలు ఏమైంది?

సూర్య ఏంటి ఇలా అయ్యాడు.. అసలు ఏమైంది?

హీరో సూర్య ఏంటి ఇలా మారిపోయాడు? ఇంతకీ ఇతను నిజంగా సూర్యనేనా? ఇవి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్స్. తాజాగా రిలీజైన  సూర్య ఫోటో చూస్తే ఎవరైనా అలాగే అంటారు. ప్రస్తుతం ఆయన కంగువ చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం.

అందుకే చాలా కష్టపడి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా.. తాజాగా సూర్య బరువు పెరిగిన ఫోటో ఒకటి నెట్టింట తగ వైరల్ అవుతోంది. గుబురు గడ్డం, బుగ్గలు పెంచి, లావుగా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో చూస్తుంటే అసలు సూర్య పోలికలే లేవు. ఈ ఫోటో చూసిన చాలా మంది ఈసారి సూర్య ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో..  నో ఈయన మా సూర్య కాదు అంటున్నారు.

ఇక తమిళ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అడిస్తున్నాడు. మరి ఈ మూవీతో సూర్య ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.