Nadu Center Review: టీనేజ్ లైఫ్కి అద్దం పట్టే కంటెంట్తో ‘నాడు సెంటర్’.. ఆశ, ఆవేశం, ఆశయం అంశాలే కథనాలుగా

Nadu Center Review: టీనేజ్ లైఫ్కి అద్దం పట్టే కంటెంట్తో ‘నాడు సెంటర్’.. ఆశ, ఆవేశం, ఆశయం అంశాలే కథనాలుగా

తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఫీనిక్స్’ మూవీతో సూర్య సేతుపతి (Surya Sethupathi) హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తండ్రి విజయ్ సేతుపతికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో ఆడియన్స్ ముందుకొచ్చాడు సూర్య సేతుపతి. అదే ‘నాడు సెంటర్’ (Nadu Center) వెబ్ సిరీస్.

ఈ తమిళ స్పోర్ట్స్ డ్రామాలో సూర్య సేతుపతి కీలక పాత్ర పోషించారు. శశికుమార్, రెజీనా కసాండ్రా, ఆశా శరత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ నవంబర్ 20, 2025న జియో హాట్‌‌‌‌స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది. మొత్తం 17 ఎపిసోడ్‌లతో ఉన్న ఈ స్పోర్ట్స్ డ్రామా, ప్రస్తుతానికి తొలి మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉన్నాయి.

నరు నారాయణన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీనేజ్ లైఫ్కి అద్దం పట్టే కంటెంట్తో తెరకెక్కింది. లవ్.. ఫ్రెండ్షిప్.. స్పోర్ట్స్ అంశాలను కథగా తీసుకుని యువతకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు డైరెక్టర్ నారాయణన్. ఈ క్రమంలోనే ప్రస్తుత యువతలో ఇమిడి ఉన్న ఆశ, ఆవేశం, ఆశయం వంటి వాటిపై డిస్కస్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రసెంట్ జనరేషన్లో ఉన్న యువత రౌడీయిజాన్ని హీరోయిజంగా భావించి గొడవలకు సిద్దపడుతూ ఉన్నారు. ఆటల్లో హీరోలుగా వెలగాలని అనుకుంటే మంచిదే. కానీ గొడవలలో హీరోగా నిలబడాలని అనుకుంటే మాత్రం భవిష్యత్తు దెబ్బతింటుందనే సందేశాన్ని ఇస్తూ నాడు సెంటర్ ఇచ్చేలా ఉంది. పూర్తీ కథ విషయానికి వస్తే.. 

కథేంటంటే:

ప్రదీప్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌(సూర్య ఎస్‌‌‌‌కే) 17 ఏండ్ల జాతీయస్థాయి బాస్కెట్‌‌‌‌బాల్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌. ఎలైట్ అనే స్కూల్‌‌‌‌లో 12వ తరగతి చదువుతుంటాడు. కానీ.. మిస్‌‌‌‌ కండక్ట్ (చెడు ప్రవర్తన) వల్ల అతన్ని స్కూల్‌‌‌‌ నుంచి పంపించేస్తారు. ఇతర ప్రైవేట్‌‌‌‌ స్కూళ్లలో కూడా అడ్మిషన్ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు ఒక గవర్నమెంట్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో చేరుస్తారు. అక్కడి స్టూడెంట్స్‌‌‌‌లో చాలామందికి డ్రగ్స్ అలవాటు ఉంటుంది.

స్కూల్‌‌‌‌లో గ్యాంగ్ ఫైట్స్ చాలా కామన్‌‌‌‌. కొందరు మెంటల్ స్ట్రగుల్స్‌‌‌‌తో బాధపడుతుంటారు. వాళ్లంతా ప్రదీప్‌‌‌‌ని చాలా ఇబ్బంది పెడతారు. వైస్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌ ఆశా శరత్ మాత్రం ప్రదీప్‌‌‌‌ని బాగా సపోర్ట్‌‌‌‌ చేస్తుంది. ప్రదీప్‌‌‌‌ వల్ల ఆ స్కూల్‌‌‌‌లోని స్టూడెంట్స్‌‌‌‌లో మార్పు వస్తుందని ఆశపడుతుంది. అందుకే కొంతమంది స్టూడెంట్స్‌‌‌‌తో బాస్కెట్‌‌‌‌బాల్ టీమ్ ఏర్పాటు చేయాలని అతనికి టాస్క్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.