అయోధ్యలో అద్భుత ఘట్టం.. గర్భగుడిలో బాలరాముని నుదుటిపై సూర్యకిరణాలు

అయోధ్యలో అద్భుత ఘట్టం.. గర్భగుడిలో బాలరాముని నుదుటిపై  సూర్యకిరణాలు

ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కంటే ఈ సారి జరిగే సీతారాముల కళ్యాణం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఎన్నో ఏళ్ల కల.. అది ఈఏడాది జనవరిలో జరిగింది. అయోధ్యలో ఈ నవమి దాదాపు 500 సంవత్సరాల తర్వాత జరుగుతున్న అతి పెద్ద వేడుక కావడంతో ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నా రు. ఏప్రిల్ 17 శ్రీరామ నవమిన అయోధ్యలో ఏర్పాటు చేసిన రామ్ లల్లా విగ్రహాంపై ఉన్న సూర్య తిలకంపై సూర్య కిరణాలు పడి బాలరాముడు దర్శనమిస్తాడు. ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 12.16 గంటలకు ఐదు నిమిషాలపాటు అయోధ్య రామమందిరం గర్భగుడిలోని విగ్రహంపై సూర్యకిరణాలు ప్రకాశించనున్నాయి.

మొదటిసారి ఈ అద్భుత దృష్యాన్ని చూసేందుకు భక్తులను ఎదురుచూస్తున్నారు. రామనవమికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సులభంగా రామ్‌లల్లా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రామజన్మభూమి  తీర్థ క్షేత్ర ట్రస్ట్  అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 19 వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు.

శ్రీరామ నవమి రోజున బాలరాముని దర్శన సమయాలు మారుతాయన్నారు. బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారు జామున 3.30 గంటల నుంచి మంగళ హారతి, అభిషేకం, అలంకరణ, దర్శనాలు జరిగాయి. ఉదయం 5.00 గంటలకు శృంగార్ హారతి కార్యక్రమం నిర్వహించారు. దర్శనాలు, పూజా కార్యక్రమాలు ఏకకాలంలో కొనసాగుతాయని.. నైవేద్యం సమర్పించే సమయంలో కొద్దిసేపు దర్శనాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయని.. పరిస్థితులకు అనుగుణంగా భోగ్‌, శయన హారతి ఉంటుందని ట్రస్ట్ ప్రకటించింది. ఈరోజు శాస్రోక్తంగా రాముని నుదుటిపై తిలకం దిద్దనున్నారు. అయోధ్య ఆలయంలో రామ్ లల్లాకు ఇదే మొదటి రామ నవమి. ఈరోజు సూర్యతిలకంపై సూర్యకిరణాలు పడేటట్లు ఐఐటీ ఇంజనీర్లు అద్దాలు, లెన్స్‌లతో ఆప్టో-మెకానికల్ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. నేరుగా గర్భగుడిలోకి సూర్యకిరణాలు ప్రవేశించేటట్లు అద్ధాలతో శాస్త్రవేత్తలు ఓ సిస్టమ్ రూపొందించారు.