IND vs SA: కోహ్లీని సమం చేసిన సూర్య..ఆ విషయంలో ఆల్‌టైం రికార్డ్

IND vs SA: కోహ్లీని సమం చేసిన సూర్య..ఆ విషయంలో ఆల్‌టైం రికార్డ్

టీమిండియా టీ20 తాత్కాలిక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తనకు కలిసొచ్చిన ఫార్మాట్ లో చెలరేగిపోతున్నాడు. టీ20 లంటే పూనకం వచ్చినట్టు ఆడే సూర్య తన టాప్ ఫామ్ ను కొసాగిస్తున్నాడు. గెబార్హ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 లో 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 56 పరుగులు చేసి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ ద్వారా సూర్య టీ20ల్లో కోహ్లీ రికార్డ్ సమం చేసాడు. 

ఈ మ్యాచ్ ద్వారా సూర్య  అంతర్జాతీయ టీ20ల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 56 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత  అందుకోవడం విశేషం. టీ20ల్లో భారత్ తరపున వేగంగా 2000 పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ మీద ఉంది. విరాట్ 56 ఇన్నింగ్స్ ల్లో ఈ మార్క్ అందుకోగా.. ఈ ముంబై వీరుడు కూడా 56 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత అందుకొని కోహ్లీ సరసన నిలిచాడు. లిజార్డ్ విలియమ్స్ బౌలింగ్ లో 4 ఓవర్ 5 వ బంతికి మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టిన సూర్య 2000 పరుగుల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
 
ఓవరాల్ గా ఈ రికార్డ్ పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ పేరిట ఆల్ టైం రికార్డ్ ఉంది. 52 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ద్వయం 2000 పరుగుల మార్క్ అందుకున్నారు. అయితే టీ20ల్లో తక్కువ బంతుల్లో వేగంగా 2000 పరుగుల మార్క్ చేరుకున్న ఆటగాడిగా సూర్య ఆల్ టైం రికార్డ్ సృష్టించాడు. కేవలం 1164 బంతుల్లోనే ఈ ఘనత సాధించి ఆస్ట్రేలియా  మాజీ కెప్టెన్ ఫించ్(1283) రికార్డ్ ను బ్రేక్ చేశాడు.  

సూర్య హాఫ్ సెంచరీ చేసి ఈ మ్యాచ్ లో రాణించినప్పటికీ భారత్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19.3 ఓవర్లలో 7 వికెట్లను 180 పరుగులు చేసింది. మ్యాచ్‌‌‌‌ మధ్యలో వర్షం రావడంతో సౌతాఫ్రికా టార్గెట్‌‌‌‌ను 15 ఓవర్లలో 152 రన్స్‌‌‌‌గా రివైజ్‌‌‌‌ చేశారు. లక్ష్య ఛేదనలో దీన్ని సఫారీలు 13.5 ఓవర్లలో కొట్టి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచారు. రీజా హెండ్రిక్స్‌‌‌‌ (27 బాల్స్ 8 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 49), కెప్టెన్‌‌‌‌ ఐడెన్‌‌‌‌ మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (30) మెరుపులు మెరిపించారు.