సూర్యకు టీ20 పగ్గాలు

సూర్యకు టీ20 పగ్గాలు
  • ఆసీస్‌‌తో సిరీస్‌‌కు టీమ్ ఎంపిక
  •     ఐదో టీ20 హైదరాబాద్‌‌ నుంచి బెంగళూరుకు ఫిష్ట్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో ఈ నెల 23 నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్‌‌లో పోటీపడే ఇండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం ఆలిండియా సీనియర్ సెలెక్షన్‌‌ కమిటీ సోమవారం జట్టును ప్రకటించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చింది. వరల్డ్ కప్ పాల్గొన్న వారిలో సూర్య, ఇషాన్‌‌, ప్రసిధ్‌‌ కృష్ణను మాత్రమే ఈ సిరీస్‌‌కు తీసుకొని మిగతా వారికి రెస్ట్ ఇచ్చింది. 

అయితే, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెప్‌గా చివరి రెండు టీ20ల్లో ఆడుతాడని తెలిపింది.  టీ20 రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోకపోవడంతో సూర్యకు పగ్గాలు దక్కాయి. ఇక, ఎలక్షన్‌‌ రిజల్ట్, ఉప్పల్ స్టేడియంలో మరమ్మతులు పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 3న  హైదరాబాద్‌లో  జరగాల్సిన చివరి టీ20ని బెంగళూరుకు మార్చారు.  ఈ నెల 23న వైజాగ్ లో తొలి టీ20 జరగనుంది.

 
టీమ్‌‌: సూర్యకుమార్  (కెప్టెన్), రుతురాజ్(వైస్ కెప్టెన్), ఇషాన్,  జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్  (కీపర్‌‌), సుందర్, అక్షర్, శివం దూబే,  బిష్ణోయ్, అర్ష్‌‌దీప్, ప్రసిధ్‌‌ కృష్ణ, అవేష్ , ముఖేష్. శ్రేయస్​ (చివరి రెండు టీ20లకు)