పాక్ ప్లేయర్లను భయపెడుతున్న సూర్య.. ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేస్తాడా..?

పాక్ ప్లేయర్లను భయపెడుతున్న సూర్య.. ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేస్తాడా..?

సూర్య కుమార్ యాదవ్.. సంవత్సరం నుంచి ఈ పేరు ట్రెండింగ్ లో ఉంది. వన్డే, టెస్టు ఫార్మాట్ లను పక్కన పెడితే టీ 20 ల్లో సూర్యను మించిన ఆటగాడు మరొకడు ఉండడమో అనే అనుమానం కలుగుతుంది. వేగంగా ఆడటంతో పాటు నిలకడగా పరుగులు చేయడం ఈ 33 ఏళ్ళ బ్యాటర్ స్పెషాలిటీ. ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎవరైనా అలవోకగా బౌండరీలు కొట్టేస్తాడు. టీ 20 స్పెషలిస్టు గా పేరొందిన సూర్య ఇప్పుడు పాక్ ప్లేయర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌ రికార్డుపై కన్నేశాడు. 

ప్రస్తుతం సూర్య 50 ఇన్నింగ్స్‌లలో 1841 పరుగులు చేసాడు. మరో 159 పరుగులు చేస్తే 2000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అంతర్జాతీయ టీ 20ల్లో వేగంగా 2000 పరుగులు చేసిన రికార్డ్ పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌ల పేరిట ఉంది. వీరిద్దరూ 52 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధించారు. సూర్య మరో రెండు ఇన్నింగ్స్ ల్లో 159 పరుగులు చేస్తే వీరిద్దరి రికార్డ్ సమం చేస్తాడు. ఒక్క ఇన్నింగ్స్ లో 159 పరుగులు చేయడం కష్టం కాబట్టి సూర్య ఉన్న ఫామ్ కు రెండు ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. 

ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్  పై కన్నేశాడు. భారత్ తరపున విరాట్ 56 ఇన్నింగ్స్ ల్లో 2000 టీ 20 పరుగులు పూర్తి  చేసుకున్నాడు. మరో 5 ఇన్నింగ్స్ ల్లో ఈ ముంబై బ్యాటర్ 159 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ 20ల్లో వేగంగా 2000 పరుగులు  పూర్తి చేసుకున్న భారత బ్యాటర్ గా నిలుస్తాడు. మరి వీటిలో ఏ రికార్డ్ సూర్య బద్దలు కొడతాడో చూడాలి. 

ALSO READ : Cricket : ఐసీసీ కొత్త రూల్..ఇకపై అలా చేస్తే 5 పరుగుల పెనాల్టీ

నవంబర్ 23 నుంచి భారత్ ఆస్ట్రేలియాతో 5 టీ 20ల సిరీస్ ఆడనుంది. కుర్రాళ్లతో నిండిన ఈ జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా  వ్యవహరించనున్నాడు. ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్ లో  7 ఇన్నింగ్స్ ల్లో 106 పరుగులు మాత్రమే చేసిన సూర్య నిరాశపరించాడు. అయితే తనకు కలిసి వచ్చిన టీ 20లోకి రావడంతో పరుగుల వరద పారిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.