గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: గురుకులాలలో 2026–-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ప్రవేశ పరీక్షతో పాటు 6,7, 8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

దరఖాస్తును <https://tgcet.cgg.gov.in>, <https://tgswreis.telangana.gov.in>, <https://tgtwgurukulam.telangana.gov.in> ఆన్ లైన్ లో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు కులం, ఆదాయం, ఆధార్, బర్త్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు.  విద్యార్థులు అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.