సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి : అన్నపూర్ణ

సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి : అన్నపూర్ణ

సూర్యాపేట, వెలుగు: సీజన్ వ్యాధులతో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ సూచించారు. గురువారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మలేరియా మాసోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో మున్సిపల్ సిబ్బంది,  ఆర్పీలు పాత్ర చాలా కీలకమన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. 

ఇంటి చుట్టూ వర్షపు నీరు నిల్వకుండా చూసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి పరిసరాలను పరిశీలించి శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్​స్పెక్టర్​సారగండ్ల శ్రీనివాస్, టీఎంసీ శ్వేత, హెల్త్ అసిస్టెంట్ సురేశ్, అసిస్టెంట్ ఎస్ఐ సతీశ్, ప్రాథమిక ఆరోగ్య సెంటర్ల డాక్టర్లు, ఆర్పీలు  తదితరులు పాల్గొన్నారు.