సూర్యాపేట, వెలుగు: ప్రతి నెలా జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం 102 ఫోన్లను రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ..ఈ సంవత్సరం 7వ దఫా మొబైల్ మేళా నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్ ను బాధితులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 2,340 మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు.
మంగళవారం రూ.20 లక్షల విలువైన 102 మొబైల్స్ బాధితులకు అందించినట్లు పేర్కొన్నారు. పోయిన మొబైల్స్ ను గుర్తించడానికి సీఈఐఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించినా వెంటనే ఈ పోర్టల్‌లో నమోదు చేసి, పీఎస్‌లో కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు.
ధాన్యం రోడ్లపై ఆరబోయవద్దు
రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబోయొద్దని ఎస్పీ సూచించారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ తప్పక ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవా లని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. అడిషనల్ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీ రవి, స్పెషల్స్ బ్రాంచ్ సీఐ రామారావు, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు.
