మంకీపాక్స్ అనుమానిత కేసులో ‘నెగెటివ్’ రిపోర్ట్

మంకీపాక్స్ అనుమానిత కేసులో ‘నెగెటివ్’ రిపోర్ట్

ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో ఇటీవల మంకీపాక్స్ లక్షణాలు బయటపడిన బాలిక కు ‘నెగెటివ్’ వచ్చింది. ఆమె నుంచి సేకరించిన శాంపిళ్లకు పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో  వైద్య పరీక్షలు నిర్వహించగా ఈవిషయం తేలిపోయింది. దీంతో దేశంలోనే మొదటి మంకీపాక్స్ కేసు యూపీలో బయటపడిందంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. మే 13 నుంచి జూన్ 2 వరకు 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7 దేశాల్లో 66 మంకీపాక్స్ మరణాలు సంభవించాయి. తొలిసారిగా 1958లో కోతుల్లో ఈ వ్యాధిని గుర్తించారు.అందుకే దీనికి మంకీపాక్స్ అనే పేరు వచ్చింది. 1970లో మొదటిసారి మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది. 2003లో అమెరికాలో ఈ వ్యాధి సోకిన వారిని గుర్తించారు. 2018లో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్ లకు చేరుకుంది.