అనుమానాస్పదంగా కాంట్రాక్టు కార్మికుడు మృతి..రామగుండం ఎన్టీపీసీ పంప్ హౌస్ వద్ద ఘటన

అనుమానాస్పదంగా కాంట్రాక్టు కార్మికుడు మృతి..రామగుండం ఎన్టీపీసీ పంప్  హౌస్ వద్ద ఘటన

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం టౌన్ పరిధి బికాలనీలోని ఎన్టీపీసీకి చెందిన పంప్​హౌస్​వద్ద కాంట్రాక్టు కార్మికుడు కాటం శ్రీనివాసులు(58) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇందిరానగర్​కు చెందిన శ్రీనివాసులు పంప్​ఆపరేటర్​గా విధులు నిర్వహిస్తుండగా.. ఆదివారం  మధ్యాహ్నం షిప్టు కూడా డ్యూటీ చేస్తానని వెళ్లాడు.  

సమీపంలోనే అతని ఇల్లు ఉండగా సాయంత్రం  భార్య రాజేశ్వరి టీ తీసుకెళ్లి ఇచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో  ఫోన్ ​చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. కూతురుతో కలిసి ఆమె భర్త వద్దకు వెళ్లగా కనిపించలేదు. నైట్​డ్యూటీకి వచ్చిన మరో కాంట్రాక్టు కార్మికుడి రాజయ్యతో కలిసి పరిసరాల్లో వెతకగా  పంప్​హౌస్​ వెనకాల చెట్ల పొదల్లో చనిపోయి కనిపించాడు. అయితే.. టాయిలెట్ కు వెళ్లి ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడ్డాడా ? లేక ఎవరైనా కొట్టి చంపారా ? అనేది తేలాల్సి ఉంది. భార్య రాజేశ్వరి ఫిర్యాదుతో రామగుండం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.