పుల్వామా దాడి పై అనుమానం ఉంది: మమతా బెనర్జీ

పుల్వామా దాడి పై అనుమానం ఉంది: మమతా బెనర్జీ

కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణ ఎన్నికలకు ముందు పుల్వామా దాడి అనుమానాలను కలిగిస్తోందన్నారు. అసలు పాకిస్తాన్‌ను అడ్డుకోవడానికి కేంద్రం ఈ అయిదేళ్లు ఏం చేసిందని ప్రశ్నించారు.

మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో…మతఘర్షణలు సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేశాయా అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాదు ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. భద్రతాపరమైన ఇబ్బంది ఉన్నప్పుడు అన్ని వ్యాన్లు ఒకేసారి ఎందుకు వెళ్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై షాడో యుద్ధానికి దిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తోందని కూడా ఆమె ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.