ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు టీచర్ల సస్పెన్షన్

ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు టీచర్ల సస్పెన్షన్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు టీచర్లను కలెక్టర్ ఉదయ్ కుమార్ సస్పెండ్​ చేశారు. కొల్లాపూర్ ప్రభుత్వ హైస్కూల్​లో స్కూల్ అసిస్టెంట్(సోషల్) కె.రామ్ జీ, ఉప్పునుంతల మండలం పులియా నాయక్ తండా యూపీఎస్​లో ఎస్జీటీ కె రాజు అన్నదమ్ములు.

వీరిద్దరూ 21న అచ్చంపేటలో నిర్వహించిన కాంగ్రెస్​ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ కావడం, బీఆర్ఎస్​ లీడర్లు ఎన్నికల అధికారులకు కంప్లయింట్​ చేయడంతో సస్పెండ్ ​చేస్తూ కలెక్టర్​ఉత్తర్వులు జారీ చేశారు.