
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: ఇతరులతో ఫోన్ మాట్లాడుతుందనే కారణంతో భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త సుత్తితో దాడి చేసి హత్య చేశాడు. పటాచ్‌చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం చిట్కూల్ గ్రామం వడ్డెర కాలనీకి చెందిన మేక వేలు స్థానికంగా రాయి కొట్టే పని చేస్తుంటాడు. వేలు భార్య రాజేశ్వరి ఇతరులతో తరుచూ ఫోన్లో మాట్లాడుతుండడంతో తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలకు నిత్యం గొడవలు జరుగుతుండేవి. కాగా బుధవారం కూడా వారి మధ్య ఫోన్ మాట్లాడే విషయమై గొడవ జరగడంతో కోపంతో వేలు రాళ్లు కొట్టే సుత్తితో రాజేశ్వరి తలపై విచక్షణా రహితంగా కొట్టాడు. అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. భార్యపై దాడి అనంతరం వేలు అక్కడి నుంచి పరారయ్యాడని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.