ఈ నెల 15 నుంచి స్వచ్ఛ పక్వాడా

ఈ నెల 15 నుంచి స్వచ్ఛ పక్వాడా

హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్లకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు సర్కారు స్కూళ్లలో చేపట్టిన స్వచ్ఛ పక్వాడా ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ వరకు రెండువారాల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. స్వచ్ఛ పక్వాడలో భాగంగా చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన యాక్టివిటీ క్యాలెండర్ పోస్టర్​ను  డీఈవోలు వాట్సాప్‌‌‌‌ ద్వారా హెచ్‌‌‌‌ఎంలకు పంపించారు. ఇలా వెంటవెంటనే జరుగుతున్న కార్యక్రమాల వల్ల క్లాస్ లకు ఇబ్బంది కలుగుతోందని, గ్రాంట్స్ ఇంకా రాకపోవడం వల్ల నిర్వహించడం కష్టంగా ఉందని హెచ్‌‌‌‌ఎంలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్‌‌‌‌తో..
స్కూళ్లు మొదలైనప్పటి నుంచి పాఠాలు తక్కువ.. ప్రోగ్రామ్​లు ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఒకదాని తర్వాత మరో ప్రోగ్రాం చేస్తుండటంతో అకడమిక్ ఇయర్ అంతా ఇవే కనిపించేలా ఉన్నాయి. బుక్స్​ఆలస్యంతో సిలబస్ లేట్ అవుతుందని టీచర్లు కంగారు పడుతుండగా.. బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్​తో వారిలో మరింత అసహనం పెరుగుతోంది.  మరోవైపు స్కూళ్లలో సరిపడా టీచర్లు లేకపోవడంతో అటు పాఠాలు చెప్పేందుకు, ఇటువంటి ప్రోగ్రాంలు చేపట్టేందుకు ఇబ్బందిగా ఉందని హెచ్‌‌‌‌ఎంలు చెప్తున్నారు. స్కూళ్లు మొదలయ్యాక బ్రిడ్జ్ కోర్సులు, అనంతరం రెండువారాల పాటు వజ్రోత్సవ వేడుకలు, ఇప్పుడు స్వచ్ఛ పక్వాడ కార్యక్రమం.. ఇలా వరుస ఈవెంట్లతో ఇబ్బందిగా ఉందని హెచ్ఎంలు అంటున్నారు. ఇదివరకు చేసిన ఈవెంట్లకే పైసలు రాలేదని, మళ్లీ కొత్త కొత్త టాస్క్‌‌‌‌లు ఇస్తున్నారని హెచ్‌‌‌‌ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరో రెండు వారాల పాటు..
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ ఐదు నుంచి ఫార్మెటివ్ అసెస్‌‌‌‌మెంట్–2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ ఒకటి నుంచి 15వరకు స్వచ్ఛ పక్వాడ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 1న స్వచ్ఛ శపథ్ చేయించాలి. రెండో రోజు స్వచ్ఛ అవేర్నెస్ డే లో భాగంగా స్కూల్ టీచర్లు, స్కూల్ మేనేజ్​మెంట్​కమిటీ మెంబర్లకు కొవిడ్ సెన్సెటివ్ వాష్ పై ట్రైనింగ్ ఉంటుంది. మూడు, నాలుగో రోజు కమ్యూనిటీ అవుట్ రీచ్ డే లో భాగంగా టీచర్లు, ఎస్‌‌‌‌ఎంసీ సభ్యులు లోకల్ కమ్యూనిటీస్ లో కొవిడ్ సెన్సెటివ్ వాష్ పై అవగాహన కల్పించాలి. 5న గ్రీన్ స్కూల్ డ్రైవ్ డే, 6, 7 తేదీల్లో స్వచ్ఛ పార్టిసిపేషన్స్ డే, 8, 9 తేదీల్లో హ్యండ్ వాష్ డే ఉంటుంది. 10, 11తేదీల్లో పర్సనల్ హైజీన్ డే, 12న స్వచ్ఛ స్కూల్ ఎగ్జిబిషన్ డే, 13, 14 తేదీల్లో స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ డే, చివరి రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహించాలని డీఈవో ఆదేశాల్లో పేర్కొన్నారు. అందులో భాగంగా గూగుల్ ఫామ్స్ లో స్వచ్ఛ యాక్షన్ ప్లాన్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. 

ఆదేశాలు వచ్చాయి.. 
అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన దాని ప్రకారం ప్రోగ్రామ్స్​ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ గ్రాంట్స్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. రెండేళ్ల నుంచి చాలా ఇబ్బందిగా ఉంటోంది. వజ్రోత్సవాలు కూడా మా డబ్బులతో నిర్వహించాం. ఇప్పుడు ఈ స్వచ్ఛ పక్వాడ కూడా మేమే నిర్వహించాలి. ఉదయం క్లాసులు నిర్వహించి లీజర్ పీరియడ్స్ లో ఈ  ప్రోగ్రామ్ చేయాలని నిర్ణయించాం. గురువారం ప్లెడ్జ్ చేయించాం. 
- టి. కస్తూరి, హెచ్ఎం, ప్రభుత్వ స్కూల్, రెజిమెంటల్ బజార్

ఏ రోజు సమాచారం ఆ రోజే..
ప్రోగ్రామ్స్​కు సంబంధించిన సమాచారం ఒకరోజు ముందు లేదంటే అదే రోజు వస్తోంది. వాట్సాప్ గ్రూప్‌‌‌‌లలో వస్తున్న పోస్టర్లకు అనుగుణంగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. యాక్టివిటీ క్యాలెండర్ లో పేర్కొన్న విధంగా స్కూల్ టైమింగ్స్, క్లాసులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ల క్లాసులకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవడానికి మాకు కూడా టైం పడుతుంది.
- నరసింహా, హెచ్ఎం, ప్రభుత్వ స్కూల్, మాసబ్ ట్యాంక్