
హైదరాబాద్ : స్వేరో పదానికి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీలో చోటు దొరకడం చాలా ఆనందంగా ఉందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ ట్వీట్ చేశారు. తరతరాల అణచివేతను ధైర్యంగా ఎదుర్కొంటూనే, జ్ఞాన ఖడ్గంతో బానిసత్వపు సంకెళ్లను ధ్వంసం చేయడం చారిత్రాత్మకమన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మనిషి ఆలోచనా సరళిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని ఈ గుర్తింపుతో నిరూపితమైందని పేర్కొన్నారు.
స్వేరో పదం ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకుంటుందని ఎప్పుడూ ఊహించలేదని, స్వేరో ఇప్పుడు నిఘంటువులో నామవాచకంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో అది క్రియగా మారుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొత్తం క్రెడిట్ దేశవ్యాప్తంగా సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు, పూర్వ విద్యార్థులు, వారి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకే దక్కుతుందని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.