దేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతి ఇక లేరు

దేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతి ఇక లేరు

ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి ఇకలేరు. 99ఏళ్లు ఉన్న ఆయన మధ్యప్రదేశ్ నార్సింగ్ పూర్లోని  శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ద్వారకా శారదా పీఠానికి, బద్రీనాథ్ లోని జ్యోతిమఠాలకు ఆయన శంకరాచార్యులుగా ఉన్నారు. దేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. రామమందిర నిర్మాణం కోసం  సుధీర్ఘ పోరాటం చేశారు. 

స్వరూపానంద సరస్వతి 1924 సెప్టెంబర్ 2న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలోని దిఘేరీ గ్రామంలో జన్మించారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే ఇంటి నుంచి పారిపోయిన ఆయన.. ధర్మప్రచారం చేశారు. 19 ఏళ్ల వయస్సులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1950లో దండి సత్యాగ్రహం సమయంలో సన్యాస దీక్ష చేపట్టి..స్వామి స్వరూపానంద సరస్వతిగా ప్రసిద్ధి చెందారు. జమ్మూకశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  స్వరూపానంద సరస్వతి మృతికి ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు.