
క్యాన్సర్ మహమ్మారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని త్రిదండి చినజీయర్ స్వామీజీ సూచించారు. దినదినానికి క్యాన్సర్ వ్యాధి గ్రస్థుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ జైత్రీ కన్వెన్షన్ లో శనివారం నాడు వికాసతరంగిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మహిళా వైద్య శిభిరాన్ని త్రిదండి చినజీయర్ స్వామీజీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామీజీ మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధి కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనదని చెప్పారు. వ్యాధి పట్ల మహిళలకు అవగాన కల్పించాల్సిన అవసరం ఎంతయినా వుందని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి ని నిర్మూలించకపోతే భవిష్యత్తు లో మరణాల సంఖ్య అధికం కాక తప్పదని చినజీయర్ స్వామీజీ హెచ్చరించారు. మరోవైపు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వికాసతరంగిణి ఉచిత మహిళా మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు.
ఈ సందర్భంగా వైద్య శిభిరం లో పాల్గొన్న వైద్య నిపుణుల తో పాటు వికాసతరంగిని సంస్థ ప్రతినిధులకు చినజీయర్ స్వామీజీ మంగళాశాసనాలు అందజేశారు.