డార్క్ థ్రిల్లర్‌‌గా మంగళవారం

డార్క్ థ్రిల్లర్‌‌గా మంగళవారం

‘ఆర్ఎక్స్‌ 100’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’.  స్వాతి గునుపాటి, ఎం.సురేష్ వర్మ, అజయ్ భూపతి కలిసి నిర్మిస్తున్నారు. నవంబర్ 17న ఐదు భాషల్లో విడుదల కానుంది. శనివారం ఈ మూవీ  ట్రైలర్‌‌ను చిరంజీవి సోషల్ మీడియాలో  విడుదల చేశారు.  విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రస్టిక్‌, యాక్షన్ థ్రిల్లర్‌‌గా ట్రైలర్ ఉందన్న ఆయన.. మూవీ టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు అతిథిగా హాజరైన హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘‘ఆర్‌‌ఎక్స్‌ 100’  షూటింగ్ 50 రోజుల్లో కంప్లీట్ చేశాం. అజయ్ భూపతి వంద రోజులు షూటింగ్ చేస్తే ఎంత పెద్ద సినిమా తీస్తాడో నాకు తెలుసు.

ఈ సినిమా కోసం అందరి కంటే నేనే ఎక్కువ  వెయిట్ చేస్తున్నా’ అన్నాడు.   ‘ఆర్‌‌ఎక్స్ 100’తో కెరీర్‌‌ను  మార్చిన అజయ్.. ఈ చిత్రంతో తనను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాడు అంది పాయల్. అజయ్ భూపతి మాట్లాడుతూ ‘ఇదొక  డిఫరెంట్ జానర్ సినిమా.  విలేజ్  నేటివిటీతో కూడిన డార్క్ థ్రిల్లర్ తీయడం చాలా కష్టం.  ఎవరూ టచ్ చేయని పాయింట్ టచ్ చేశా. దేవతలకు ఇష్టమైన రోజు కనుక మంగళవారంను జయవారం అని కూడా పిలుస్తారు. నా సినిమాకు ఈ టైటిల్ పెట్టడం వెనుక మరో కారణం ఉంది. అది సినిమా చూస్తేనే తెలుస్తుంది’ అని చెప్పాడు. నటీనటులు నందిత శ్వేతా, అజ్మల్ అమీర్, రవీందర్ విజయ్, నిర్మాతలు స్వాతి, సురేష్​ వర్మ పాల్గొన్నారు.