
వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి మున్సిపాలిటీకి చెందిన స్వీపింగ్ మెషిన్లో గురువారం మంటలు చెలరేగాయి. డీజిల్ ట్యాంక్ వద్దనే మంటలు చెలరేగడంతో పెద్దఎత్తున పొగలు వచ్చాయి. మున్సిపాలిటీ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. రోడ్ల విస్తరణ సమయంలో ఏడాది క్రితం రూ.70 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన స్వీపింగ్ మెషిన్ రెండు రోజులు కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు.
పాడైన మెషిన్నుసగం ధరకు కొనుగోలు చేసి, మున్సిపాలిటీ నుంచి రూ.70 లక్షలు కాజేశారని అప్పట్లో దుమారం చెలరేగింది. చైర్మన్, కౌన్సిలర్లు అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలని కలెక్టర్, మంత్రికిఆల్పార్టీ జేఏసీ అధ్యక్షుడు సతీశ్యాదవ్ ఫిర్యాదు చేశారు. అనేక ఆరోపణలు వస్తున్న క్రమంలో మెషిన్లో మంటలు చెలరేగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్నిప్రమాదంపై విచారణ జరిపించాలని సతీశ్యాదవ్ డిమాండ్ చేశారు. కాగా మున్సిపల్ అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయని చెబుతున్నారు.