భారీ ఔట్​లెట్‌‌‌‌ను ప్రారంభించిన దాదుస్

భారీ ఔట్​లెట్‌‌‌‌ను ప్రారంభించిన దాదుస్

హైదరాబాద్, వెలుగు : స్వీట్లు,  స్నాక్స్‌‌‌‌ రిటైలర్​ దాదుస్ తమ సరికొత్త భారీ ఔట్​లెట్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లోని కొంపల్లిలో ప్రారంభించినట్లు ప్రకటించింది.  ఇది సంస్థకు నగరంలో పదవ స్టోర్‌‌‌‌.  ఈవెంట్‌‌‌‌లు,  సామాజిక కార్యక్రమాలను నిర్వహించడానికి అనువుగా ఇందులో కన్వెన్షన్ స్పేస్‌‌‌‌ అందుబాటులో ఉంటుంది. ఈ ఐదు అంతస్తుల భవనం మొత్తం పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ దాదుస్ స్వీట్స్,  మసాలా రిపబ్లిక్ ఉంటాయి.

మసాలా రిపబ్లిక్‌‌‌‌ మెనూ లో ఫ్యూజన్ చాట్, మోడరన్ ఇండియన్, కాంటినెంటల్, చైనీస్  వంటకాలు ఉంటాయి. తాము దక్షిణాది స్వీట్స్​నూ అందిస్తున్నామని దాదుస్ ​తెలిపింది. హైదరాబాద్​లో మరిన్ని ఔట్​లెట్స్​ తెరుస్తామని సంస్థ యజమాని రాజేష్ దాదు వెల్లడించారు. ఎయిర్​పోర్టులోనూ ఔట్​లెట్​ తెరుస్తామని వివరించారు.