
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు పీఆర్సీలు, డీఏ, సీసీఎస్ బకాయిలు చెల్లించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల సంద ర్భంగానైనా ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని నేతలు కోరారు. మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ అయ్యాక ఇప్పటి వరకు రీయింబర్స్ మెంట్ రూ.5 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, కొత్త బస్సుల కొనుగోళ్లకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని నేతలు కోరారు.