త్వరలో Swiggyలో AIతో వాయిస్ సెర్చింగ్ ద్వారా ఆర్డర్లు..

త్వరలో Swiggyలో AIతో వాయిస్ సెర్చింగ్ ద్వారా ఆర్డర్లు..

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారమ్ స్విగ్గీ ఇప్పుడు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. కస్టమర్లు మరింత సులభంగా ఆర్డర్ చేసుకునేలా కొత్త టెక్నాలజీ తీసుకొస్తోంది. స్విగ్గీ తన కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తోంది. వివిధ భాషల్లో ఆర్డర్లను అర్థం చేసుకునేందుకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్(LLM) ని ఉపయోగిస్తోంది. వాయిస్ సెర్చింగ్ ద్వారా కస్టమర్లు ఆర్డర్లు చేసుకోవచ్చు. దీని ద్వారా తన సెర్చింగ్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. 
AI న్యూరల్ సెర్చ్ ఫీచర్ ద్వారా కస్టమర్లు చాలా సులభంగా తమకు కావాల్సిన వాటిని శోధించవచ్చని  స్విగ్గీ సీటీవో మధుసూదన్ రావు తెలిపారు. నిర్దిష్ట కీలక పదాలు అవసరం లేకుండా సూచనలిస్తోందన్నారు. వినియోగదారులు కోరుకున్న వాటిని కనుగొనడానికి సులభతరం చేస్తుంది. 

స్విగ్గీ తన ఇన్ స్టామార్ట్ విభాగంలో కూడా ఈ సాంకేతికతను అనుసంధానిస్తోంది.  ఇది కస్టమర్లకు కిరాణా సామాగ్రి, గృహోపకరణాలను కనుగొనడం సమర్థవంతమైన, సంతృప్తి కరమైన షాపింగ్  చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. సెప్టెంబరు నాటికి ఈ ఫీచర్ ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుంది. వచ్చే ఫలితాల ఆధారంగా యాప్‌లోని అన్ని శోధనలకు విస్తరించాలని Swiggy లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భారత దేశంలోని వివిధ భాషల్లో వాయిస్ ఆధారంగా సెర్చింగ్ చేయొచ్చు. 

 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) ఉపయోగించి రెస్టారెంట్ యజమానులు, డెలివరీ బాయ్ లకు మధ్య సంభాషణను సులభతరం చేయనుంది. రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ పికప్, రేట్లు, చెల్లింపులు, కస్టమర్ అడ్రస్ వంటి అంశాలపై ఏమైనా సందేహాలుంటే దీని ద్వారా పరిష్కారం అవుతాయి. LLM వినియోగంతో రెస్టారెంట్ ఓనర్ యాప్,  వాట్సప్ లలో ఎలాంటి సందేహాలున్నా.. సహాయం పొందవచ్చు. 

ఏఐ కి చెందిన ఈ ఉత్పాదక ఆవిష్కరణ ద్వారా వినియోగ దారులకు అందించే సేవల్లో విప్లవాత్మకంగా మార్పులు తెచ్చేందుకు స్విగ్గీ కృషి చేస్తోంది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ విధానంలో అటు కస్టమర్లకు ఇటు యజమానులు ఇద్దరికీ సంతృప్తిని కలిగించేలా మెరుగైన సేవలు అందించాలని ప్రయత్నిస్తోంది.