
సంగారెడ్డి, వెలుగు : ఎండాకాలం వేడిని తట్టుకోలేక పిల్లలు, పెద్దలు ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో చాలామంది స్విమ్మింగ్‌పూల్స్ కు వచ్చి ఈత నేర్చుకుంటున్నారు. దీంతో సంగారెడ్డి రాజీవ్ పార్క్ వద్ద జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ సందడిగా మారింది. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 వరకు ఈత కొట్టడానికి అనుమతి ఇచ్చారు.
ఎండాకాలం కావడంతో రోజుకు దాదాపు 200 మంది ఈత నేర్చుకునేందుకు వస్తున్నారు. నలుగురు లైఫ్ గాడ్స్ పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతోంది. స్విమ్మింగ్ డ్రెస్ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. నిర్ణీత రుసుము రూ.100 చెల్లిస్తే గంట స్విమ్మింగ్ నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. -