సిస్కాకు కోటి ఎల్ఈడీ బల్బుల కాంట్రాక్ట్

సిస్కాకు కోటి ఎల్ఈడీ బల్బుల కాంట్రాక్ట్

‘గ్రామ్‌‌‌‌ ఉజాలా స్కీమ్‌‌‌‌’ కింద టెండర్‌‌‌‌‌‌‌‌ గెలుచుకున్న కంపెనీ


గ్రామ్‌‌‌‌ ఉజాలా ఎల్‌‌‌‌ఈడీ స్కీమ్‌‌‌‌ కింద  ఎల్‌‌‌‌ఈడీ లైట్లను అందించే కాంట్రాక్ట్‌‌‌‌ను సిస్కా ఎల్‌‌‌‌ఈడీ దక్కించుకుంది. కార్బన్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ మోడల్లో ఈ కాంట్రాక్ట్‌‌‌‌ను పొందింది. అంటే కంపెనీకి అదనంగా కార్బన్ క్రెడిట్స్‌‌‌‌ వస్తాయి. వీటిని ఇతర కంపెనీలకు అమ్ముకొని రెవెన్యూ సంపాదిస్తుంది. లిమిట్‌‌‌‌ను మించి కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలపై ట్యాక్స్ పడుతుందన్న విషయం తెలిసిందే. కార్బన్‌‌‌‌ క్రెడిట్స్‌‌‌‌ ఉంటే ఈ లిమిట్‌‌‌‌ పెరుగుతుంది. వీటిని సిస్కా ఎల్‌‌‌‌ఈడీ ఇతర కంపెనీలకు అమ్ముకోవచ్చు. ఈ యూనిక్‌‌‌‌  టెండర్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వ సంస్థ కన్వర్జెన్స్‌‌‌‌ ఎనర్జీ సర్వీసెస్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌(సీఈఎస్‌‌‌‌ఎల్‌‌‌‌) నిర్వహించింది. 50–50 రెవెన్యూ మోడల్లో ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను చేపట్టనున్నారు. అంటే ఎల్‌‌‌‌ఈడీలను అందించడానికయ్యే ఖర్చులో 50 శాతాన్ని సిస్కా, మిగిలిన 50 శాతాన్ని సీఈఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ పంచుకుంటాయి. మొత్తం 12 వాట్ల కెపాసిటీ ఉన్న 70 లక్షల ఎల్‌‌‌‌ఈడీ బల్బులు, 7 వాట్ల కెపాసిటీ ఉన్న 30 లక్షల ఎల్‌‌‌‌ఈడీ బల్బులను సిస్కా సప్లయ్‌‌‌‌ చేస్తుంది. ఎల్‌‌‌‌ఈడీ బల్బు కనీస ధర రూ. 10.  ఈ కోటి ఎల్‌‌‌‌ఈడీల కాస్ట్‌‌‌‌లో 50 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ‘ఓపెన్ టెండర్ ప్రాసెస్‌‌‌‌ ప్రకారం.. గ్రామ్‌‌‌‌ ఉజాలా ఎల్‌‌‌‌ఈడీ స్కీమ్‌‌‌‌ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌‌‌‌ఈడీ లైట్లను సప్లయ్‌‌‌‌ చేసే కాంట్రాక్ట్‌‌‌‌ను సిస్కా గెలుచుకుంది’ అని సీఈఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ సీఈఓ మహు ఆచార్య అన్నారు. ఈ స్కీమ్‌‌‌‌ను ఈ ఏడాది మార్చిలో  పవర్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. ఇప్పటి వరకు ఉత్తర ప్రదేశ్‌‌‌‌, బిహార్ రాష్ట్రాలలో ఎల్‌‌‌‌ఈడీ లైట్లను సరఫరా చేశారు. తర్వాత దశలో గుజరాత్‌‌‌‌, ఆంధ్రప్రదేశ్‌‌‌‌, మహారాష్ట్రాలలో సరఫరా చేయనున్నారు. ఎల్‌‌‌‌ఈడీ లైట్ల వాడకాన్ని పెంచడం ద్వారా ఎనర్జీని సేవ్‌‌‌‌ చేయడంపై ఈ స్కీమ్‌‌‌‌ దృష్టి పెడుతోంది. వాతావరణ మార్పులను తగ్గించడం వంటి అంశాలలో ప్రైవేట్ కంపెనీలు పాలుపంచుకునే అవకాశాన్ని గుర్తించడం ఆనందంగా ఉందని సిస్కా ఎల్‌‌‌‌ఈడీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ రాజేష్‌‌‌‌ ఉత్తమచాందని అన్నారు. కాగా, సీఈఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ ప్రభుత్వ కంపెనీ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌(ఈఈఎస్‌‌‌‌ఎల్‌‌‌‌)కు ఫుల్లీ ఓన్డ్‌‌‌‌ సబ్సిడరీ. అఫోర్డబుల్‌‌‌‌ ధరలోనే క్లీన్ ఎనర్జీని అందించడం ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం.