కరోనా పనిపడుతున్న టీ సెల్స్

కరోనా పనిపడుతున్న టీ సెల్స్
  • లక్షణాలు లేని కేసుల్లో యాక్టివ్ గా టీ సెల్స్
  • చిన్నప్పుడు వేసుకున్న వ్యాక్సిన్లూ మేలు చేస్తున్నయ్
  • పోలియో వ్యాక్సిన్తో 43 శాతం తగ్న కరోనా రిస్క్
  • న్యుమోనియా వ్యాక్సిన్తో 28 శాతం ప్రొటెక్షన్
  • ఏసీఈ2 తక్కువగా ఉండడం వల్లే పిల్లలకు రిస్క్ తక్కువ
  • సైంటిస్టుల స్టడీల్లో వెల్లడి

ముంబైలోని ధారావీ.. ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడ. ఇప్పటిదాకా అక్కడ 2,600 మందికిపైగా కరోనా బారిన పడ్డారు. అందులో 70 నుంచి 80 శాతం దాకా లక్షణాలు లేని కేసులేనని అధికారుల అంచనా! ఇట్లాంటి లక్షణాలు లేని కేసుల్లోకరోనా తీవ్రత చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. మరి, దానికి కారణమేంటి? ఏ శక్తి కరోనా నుంచి రక్షణ కల్పిస్తోంది. గుట్టుగా పనిచేసుకుంటూ పోతున్న ఆ శక్తి ‘టీ సెల్స్’ అని ఇద్దరు ఇండియన్ సైంటిస్టులు సహా మరి కొందరి స్టడీల్లోతేలింది. చాలా వరకు లక్షణాలు లేని కేసుల్లో టీ సెల్స్ రక్షణ కల్పిస్తున్నాయని, అందుకే కొన్ని చోట్ల ఇప్పటికే కరోనా కంట్రోల్ అయిపోయిందని సైంటిస్టులు అంటున్నారు. ధారావీలో ఇప్పటికే అందరికీ హెర్ ఇడ్ మ్యూనిటీ వచ్చేసిందని మన అధికారులు చెబుతున్నారు . ఇక, టీ సెల్స్కు తోడుగా మనలోని జీన్స్, చిన్నప్పుడు వేసుకున్న వ్యాక్సి న్స్, మొహానికి పెట్టుకుంటు న్నమాస్కులు కరోనా కు అడ్డుగోడలా నిలుస్తున్నట్టు స్టడీలో తేలింది. మరి, అవి కరోనాను ఎలా అడ్డుకుంటున్నాయి?

టీ సెల్స్ గుర్తుపడుతున్నయ్

కరోనా వైరస్ను అడ్డుకోవాలంటే దానికి తగ్గట్టుయాంటీ బాడీలు శరీరంలో ఉండాలన్నది ఎప్పటి నుంచో సైంటిస్టులు చెబుతున్నమాట. అంటే ఇమ్యూనిటీ గట్టిగా ఉండాలి. అయితే, యాంటీ బాడీల కన్నా ఇమ్యూనిటీకి వెన్ను అయిన ‘టీ సెల్స్’ అసింప్టమా టిక్ కేసుల్లోఎక్కువగా పనిచేస్తున్నాయని అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూ ట్స్ ఆఫ్ హెల్త్, స్వీడన్లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ల స్టడీల్లో తేలింది. కరోనా కొత్తదే అయినా.. ఆ మొండి మహమ్మారిని టీ సెల్స్ గుర్తుపడుతున్నాయి. లక్షణాల్లేని వాళ్ళతోఅవే ప్రొటెక్టర్స్ గా మారుతున్నాయి. దానికి కారణం చిన్నప్పుడు వేసుకున్న వ్యాక్సిన్లే నని క్సిన్లే సైంటిస్టులు చెబుతున్నారు. వాటి ప్రభావం వల్లే కరోనాకు క్రాస్ ప్రొటెక్షన్ వస్తోందని అంటున్నారు. బోస్టన్, బార్సిలోనా (స్పెయిన్), వుహాన్(చైనా) వంటి మేజర్ సిటీల్లోచాలా మందిలో యాంటీబాడీస్ ఉన్నా.. ఆ పర్సంటేజ్ సింగిల్ డిజిట్ లోనే ఉంటుందన్నది స్వీడన్ సైంటిస్టుల మాట. కానీ, దానికి భిన్నంగా చాలా మంది అసింప్టమా టిక్ పేషెంట్లలో డైరెక్గా ట్ టీ సెల్సే రంగంలోకి దిగుతున్నాయని అంటున్నారు. స్వీడన్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకపోయినా కరోనా అంత సీరియస్గా లేకపోవడం, ముంబై స్లమ్ ఏ రియాల్లోని (ప్రత్యేకించి ధారావీ) ప్రజల్లో కరోనా ఉన్నా దాని తీవ్రత అంతగా లేకపోవడానికి కారణం.. వాళ్లకుముందు నుంచీ ఉన్న ఇమ్యూనిటీనేని చెబుతున్నారు.

కొన్నేళ్ల పాటు ప్రభావం…

ఇటీవలి కింగ్స్ కాలేజీ లండన్ స్టడీల్లో కరోనాపై యాంటీ బాడీ ల ప్రభావం జస్ట్ మూడు నెలలే ఉంటుందని తేలింది. అదే టీ సెల్స్ విషయానికి వస్తే కొన్నేళ్లపాటు ‘ఇమ్యూనిటీ మెమొరీ’ ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. కాబట్టిజనాలకు యాంటీ బాడీ టెస్టులు చేయడానికి బదులు టీ సెల్స్పై దృష్టి పెడితే బాగుంటుందని శాన్ డయీగోలోని లా జోలా ఇనిస్టిట్యూ ట్ ఫర్ ఇమ్యూనాలజీ సైంటిస్టులు అలె జాండ్రో సెట్టీ, షేన్క్రాటీ అంటున్నారు. 2015 నుంచి 2018 మధ్య డొనేట్ చేసిన బ్లడ్ బ్యాంకుల్లోని రక్తం శాంపిళ్లను తీసుకుని వాళ్లుఈ మధ్య స్టడీ చేశారు.ఆ పాత శాంపి ళలోని ్ల 60 శాతం వరకు శాంపిళ్లలోని టీసెల్స్.. ఈ మధ్యే పుట్టిన కొత్తదైన కరోనా వైరస్ ను గుర్తించి చంపేశాయని తేలింది. కొన్ని రోజులపాటు ఆ రక్తాన్ని అబ్జర్వ్ చేస్తే మళ్లీకరోనా వైరస్ జాడే లేదట. మరికొన్ని దేశాల్లోనూ ఇదే ప్రభావం కనిపించింది. నెదర్లాం డ్స్లో 20 శాతం, జర్మనీలో 34 శాతం, సింగపూర్లో 50 శాతం శాంపిళ్లలో కరోనాపై టీసెల్స్ ప్రభావం చూపించాయని తేలింది.

కారణమేంటి..?

టీ సెల్స్ ‘మెమొరీ’ బాగా పనిచేయడానికి కారణమూ లేకపోలేదంటున్నారు సైంటిస్టులు. అందులో ముఖ్యమైనది ఇలాంటి వైరస్లకు ఇంతకుముందే ఎక్స్పోజ్ అవడం, వాటికి మన ఇమ్యూనిటీ మెమొరీ ఉండడం ఒక కారణమంటున్నారు. ప్రత్యేకించి సార్స్, మెర్స్ వంటి కరోనా లాంటి వైరస్ ఇన్ఫెక్షన్లు ప్రముఖ పాత్ర పోషిస్తు న్నాయని చెబుతున్నారు. అవి కాకుండా మామూలు జలుబుకు కారణమయ్యే కరోనా ఫ్యామిలీలోని మరో నాలుగు వైరస్లూ టీ సెల్స్ రెస్పాన్స్కు బాటలు వేస్తు న్నాయంటున్నారు. వాటి వల్లే కరోనా వైరస్పై టీ సెల్స్ గురి ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు.

పిల్లలపై ప్రభావం అందుకే తక్కువ

పిల్లలపైనా కరోనా ప్రభావం ఉన్నా అది తక్కువే. దానికి కారణాలేంటో తెలుసుకునేందుకునేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కు చెందిన సైంటిస్ట్ ఆల్కిస్ టోగియాస్ స్టడీ చేశారు. మన ఒంట్లో వైరస్ రెప్లికేట్ కావడానికి ఉయోగపడే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ2) అనే రిసెప్టర్లు పిల్లల్లో తక్కువగా ఉండడం వల్లే కరోనా ఎఫెక్ట్ అంతగా ఉండట్లేదని ఆయన గుర్తించారు. దాదాపు 2 వేల ఫ్యామిలీలపై స్టడీ చేశారు. అలర్జీలు, ఆస్తమా ఉన్నపిల్లల్లో ఈ ఏసీఈ2 రిసెప్టర్లు తక్కువగా ఉంటున్నాయని టోగియాస్ తేల్చారు. అలర్జీలకు ఎక్స్పోజ్ అయిన పిల్లల్లో అవి మరింత పడిపోతున్నట్టు గుర్తించారు. కాబట్టి పిల్లలకు ఆస్తమా ఉన్నా కరోనా ముప్పు అంతగా ఉండదని ఆయన అంటున్నారు. అలర్జిక్ రియాక్షన్లు కరోనా నుంచి రక్షణ ఇస్తాయని చెబుతున్నారు. అంతేగాకుండా ఇటలీ, ఆసియా వంటి ప్రాంతాల్లో ఏసీఈ2కు సంబంధించిన జీన్స్ లోనూ మార్పులుంటున్నాయని, అలాంటి వాళ్లలో ప్రత్యేకమైన మ్యుటేషన్లు కనిపిస్తున్నాయని మరికొన్ని స్టడీలు నిర్ధా రించాయి.

ఏంటీ టీ సెల్స్?

మన శరీరానికి ఇవి ఆర్మీ అని చెప్పుకోవచ్చు. ఇమ్యూనిటీకి తెల్ల రక్తకణాల్లోనిటీ సెల్స్, బీ సెల్స్ మూలం. ఎముక మజ్జ(బోన్ మ్యారో)లో టీసెల్స్పుట్టి.. అక్కడి నుంచి థైమస్ గ్లాండ్లోకి వెళతాయి. ఆ థైమ స్ గ్లాండ్ ద్వారానే ఈ టీ సెల్స్ విడుదల అవుతాయి. అందుకే వాటిని టీ సెల్స్అని పిలుస్తుంటారు. ఈ టీ సెల్స్ లోనూ మూడు రకాలుంటాయి. హెల్పర్ టీ సెల్స్, కిల్లర్ టీ సెల్స్, రెగ్యులేటరీ టీ సెల్స్. శరీరంలోకి ఎంటరైన శత్రు (బ్యాక్టీరియాక్టీ , వైరస్) కణాలను చంపేందుకు యాంటీ బాడీలను పుట్టిం చేలా బీ సెల్స్ను హెల్పర్టీ సెల్స్యాక్వేట్టి చేస్తే.. డైరెక్గా ట్ ఆ కణాలను చంపేసేవి కిల్లర్టీ సెల్స్. ఇక, మన ఒంట్లోని కణాలే మనకు యాంటీగా మారితే.. అవి మనపై ఎటాక్చేయకుండా అడ్డుకునేవి రెగ్యులేటరీ టీ సెల్స్. కరోనా వచ్చినప్పటి నుంచి బాగా వినిపిస్తున్నది యాంటీ బాడీల గురించే. వాటిని పుట్టించేవి బీ సెల్స్. బీ సెల్స్ది ఇండైరెక్ట్ రియాక్షన్ అయితే.. టీ సెల్స్ది డైరెక్ట్రియాక్షన్ . ఇమ్యూనిటీ జ్ఞాపకశక్తికి టీ సెల్స్ తోడ్పడతా యి. వైరస్లు లేదా బ్యాక్టీరియాలు ఎంటరైనప్పుడు వాటిని గుర్తుపెట్టుకుని చంపేస్తాయి.

చిన్నప్పటి వ్యాక్సిన్లూ మేలు చేస్తున్నయ్

పిల్లలకు రకరకాల వ్యాక్సిన్లు వేయిస్తుంటారు. పోలియో, బీసీజీ, న్యుమోనియా వంటివి ఇస్తారు. అవి కరోనా వైరస్పై ఇమ్యూన్ రెస్పాన్స్ను స్ట్రాంగ్ చేస్తున్నాయని స్టడీల్లో తేలింది. చెస్టర్లోని మాయో క్లినిక్ డాక్టర్లు వ్యాక్సిన్ల ప్రభావాన్ని అంచనా వేశారు. క్లినికల్ డేటాను మెయింటెయిన్ చేసే ఎన్ఫరెన్స్ సంస్థలోని ఎక్స్ పర్స్ ట్ సహాయంతో లక్షా 37 వేల 37 మంది కరోనా పేషెంట్ల రికార్డు లను పరిశీలించారు. 7 రకాల వ్యాక్సిన్లు కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నాయని తేల్చారు. రెండు వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పని చేస్తున్నట్టు గుర్తించారు. పోలియో వ్యాక్సిన్ కరోనా ఇన్ఫెక్షన్లను 43 శాతం వరకు తగ్గించినట్టు, న్యుమోనియాకు రక్షణగా వేసే వ్యాక్సిన్ 28 శాతం వరకు ముప్పును తగ్గించినట్టు గుర్తించారు. ఎన్ఫరెన్స్లో పనిచేసే మన దేశానికి చెందిన చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ వెంకీ సౌందరరాజన్ మొదట వ్యాక్సిన్ల ప్రభావాన్ని గుర్తించారు. కరోనా సోకిన వాళ్ల ప్రాంతం, కోమార్బిడిటీస్ (ఇతర జబ్బులున్నోళ్లు),కొలనోస్కోపీలు, మామ్మోగ్రాఫ్ చేయించుకున్నోళ్ల వివరాల ఆధారంగా స్టడీ చేశారు. అలాంటి వాళ్లలోనూ వ్యాక్సిన్ల ప్రభావం ఎక్కువగానే ఉందని గుర్తించారు. ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్న వ్యాక్సిన్లకు దీటుగా పాత వాటి ప్రభావాన్ని మరింత కచ్చితంగా అంచనా వేస్తే.. కరోనా వ్యాక్సిన్ల స్ట్రా టజీ మారిపోతుందని సౌందర్ రాజన్ చెప్పారు.