T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. సెమీ ఫైనల్‌కు వెళ్లే జట్లేవో చెప్పిన ఎక్స్ పర్ట్స్

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. సెమీ ఫైనల్‌కు వెళ్లే జట్లేవో చెప్పిన ఎక్స్ పర్ట్స్

ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రస్తుతం అందరి దృష్టి టీ20 వరల్డ్ కప్ పై నెలకొంది. ఎన్నడూ లేనో విధంగా ఈసారి టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడనుండడంతో ఆసక్తికరంగా మారింది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 2 నుంచి జూన్ 30 వరకు ఈ పొట్టి సమరం జరుగుతుంది. కొన్ని జట్లు టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంటే మరికొన్ని జట్లు సంచలనాలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక టోర్నీ ప్రారంభం కాకముందే ఎక్స్ పర్ట్స్ సెమీస్ వెళ్లే జట్లపై తమ ప్రిడిక్షన్ ఇచ్చారు.           

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను స్టార్ స్పోర్ట్స్‌ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయ‌నుంది. ఈ మెగా ఈవెంట్ కు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న కొంతమంది క్రికెట్ ఎక్స్ పర్ట్స్ ఏయే జట్లు సెమీస్ కు చేరుతాయో తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్, పాల్ కాలింగ్‌వుడ్,మాథ్యూ హేడెన్, మహ్మద్ కైఫ్, టామ్ మూడీ, ఎస్ శ్రీశాంత్ లు, బ్రియాన్ లారా, క్రిస్ మోరీస్ ఉన్నారు.     వీరంతా కూడా టీమ్ఇండియా సెమీస్‌కు చేరుకుంటుంద‌ని చెప్ప‌డం విశేషం. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఆశ్చర్యకరంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీస్ కు వెళ్తుందని చెప్పాడు.  

మాజీల ఆట‌గాళ్ల ప్ర‌కారం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్‌కు చేరే జట్లు ఇవే..
సునీల్ గవాస్కర్ – భారత్, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్, ఆస్ట్రేలియా
బ్రియాన్ లారా – భారత్, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్
ఆరోన్ ఫించ్ – భారత్, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్, ఆస్ట్రేలియా
టామ్ మూడీ – భారత్, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా
అంబటి రాయుడు – భారత్, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్, సౌతాఫ్రికా
కాలింగ్‌వుడ్ – భారత్, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్, ఆస్ట్రేలియా
క్రిస్ మోరిస్ – భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా
మహ్మద్ కైఫ్ – భారత్, ఇంగ్లాండ్‌, పాకిస్తాన్, ఆస్ట్రేలియా
శ్రీశాంత్ – భారత్, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్, ఆస్ట్రేలియా