కివీస్​తో ఫైనల్‌లో తలపడేదెవరు?

కివీస్​తో ఫైనల్‌లో తలపడేదెవరు?
  • నేడు పాకిస్తాన్‌‌‌‌, ఆస్ట్రేలియా మధ్య సెమీస్‌‌‌‌ పోరు
  • రా. 7.30  నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో లైవ్‌‌‌‌

దుబాయ్‌‌‌‌: సూపర్‌‌‌‌12లో ఆడిన ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో నెగ్గి టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో రెండో టైటిల్‌‌‌‌కు రెండు అడుగుల దూరంలో ఉన్న పాకిస్తాన్‌‌‌‌కు ఆస్ట్రేలియా సవాల్‌‌‌‌ విసురుతోంది. సరైన టైమ్‌‌‌‌లో టాప్‌‌‌‌ గేర్‌‌‌‌లోకి వచ్చిన ఆసీస్‌‌‌‌ గురువారం ఇక్కడ జరిగే రెండో సెమీఫైనల్లో పాక్‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. నాటౌట్‌‌‌‌గా నాకౌట్‌‌‌‌కు వచ్చిన పాక్‌‌‌‌ అదే ఊపులో ఫైనల్‌‌‌‌ చేరాలని చూస్తోంది. అంతేకాక 2010 టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోపక్క సూపర్‌‌‌‌ 12 రౌండ్‌‌‌‌లో ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో నాలుగు గెలిచిన ఆసీస్‌‌‌‌ కూడా జోరు మీదుంది. పైగా, ఐసీసీ ఈవెంట్స్‌‌‌‌లో భాగంగా పాక్‌‌‌‌తో జరిగిన నాకౌట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లన్నింటిలోనూ విజయం సాధించడంతో కంగారూలు కూడా కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. జట్లు విషయానికొస్తే 2016 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ రౌండ్‌‌‌‌లోనే ఇంటిదారి పట్టిన పాక్‌‌‌‌.. ప్రస్తుతం అన్ని విభాగాల్లో బలంగా ఉంది. పాకిస్తాన్‌‌‌‌ సూపర్‌‌‌‌ లీగ్‌‌‌‌ వల్ల ప్లేయర్లు ప్రెజర్‌‌‌‌ను బాగా హ్యాండిల్‌‌‌‌ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో నాలుగు హాఫ్‌‌‌‌ సెంచరీలు చేసిన  కెప్టెన్‌‌‌‌ బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌(264)  బ్యాటింగ్‌‌‌‌కు వెన్నెముక. మరో ఓపెనర్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ కూడా రాణిస్తున్నాడు. మిడిలార్డర్‌‌‌‌లో  షోయబ్‌‌‌‌ మాలిక్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ హఫీజ్‌‌‌‌, ఆసిఫ్‌‌‌‌ అలీ సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్నారు. ఫఖర్‌‌‌‌ జమాన్‌‌‌‌ ఒక్కడే మంచి ఇన్నింగ్స్‌‌‌‌ బాకీ ఉన్నాడు. ఇక, పేస్‌‌‌‌ త్రయం షాహీన్‌‌‌‌ ఆఫ్రిది, హారిస్‌‌‌‌ రవూఫ్‌‌‌‌,  హసన్‌‌‌‌ అలీ అంచనాలు అందుకుంటున్నారు.  స్పిన్నర్లు హఫీజ్‌‌‌‌, షాదాద్‌‌‌‌,ఇమాద్‌‌‌‌ వసీం తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిసున్నారు. దాంతో, పాక్‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో తొలి టైటిల్‌‌‌‌పై కన్నేసిన ఆసీస్‌‌‌‌..పాక్‌‌‌‌ గండాన్ని ఎలాగైనా దాటాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్‌‌‌‌ చేతిలో ఎదురైన ఓటమి తప్పిస్తే.. టోర్నీలో ఆసీస్‌‌‌‌ ఇప్పటిదాకా అంచనాలు అందుకుంది. ఓపెనర్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి రావడం జట్టు కాన్ఫిడెన్స్‌‌‌‌ను అమాంతం పెంచేసింది. కెప్టెన్‌‌‌‌ ఆరోన్ ఫించ్‌‌‌‌, గ్లెన్‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌, స్మిత్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో కీలకం. జంపా రూపంలో వరల్డ్‌‌‌‌ క్లాస్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ ఆసీస్‌‌‌‌ వద్ద ఉండగా పేసర్లు హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌, స్టార్క్‌‌‌‌, కమిన్స్‌‌‌‌ కూడా సత్తా చూపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండగా టాస్‌‌‌‌ కీలకం కానుంది. మరి, ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్​తో తలపడే జట్టేదో చూడాలి.