టీ20 వరల్డ్ కప్: తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్:  తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ లో తొలి సెమీ పోరు మొదలైంది. న్యూజిలాండ్   పాకిస్తాన్  మధ్య  జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ లో ఓపెనర్  ఫిన్ అలెన్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ప్రస్తుతానికి  3 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది.   కేన్ విలియమ్సన్ 8, కాన్వే 11పరుగులతో  క్రీజులో ఉన్నారు.  ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది. రేపు  ఇంగ్లాండ్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో  ఇవాళ గెలిచిన జట్టు తలపడనుంది.