‘శభాష్‌‌‌‌‌‌‌‌ మిథూ’ చిత్ర విశేషాలు

‘శభాష్‌‌‌‌‌‌‌‌ మిథూ’ చిత్ర విశేషాలు

బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న తాప్సీ, జులై 17న ‘శభాష్‌‌‌‌‌‌‌‌ మిథూ’ చిత్రంతో వస్తోంది. క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిథాలీ రాజ్‌‌‌‌‌‌‌‌ బయోపిక్ ఇది. రాహుల్ ధోలాకియా దర్శకుడు. ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌ మీట్‌‌‌‌‌‌‌‌లో తాప్సీ మాట్లాడుతూ ‘క్రికెట్ ఆడటం, మిథాలి పాత్రలో నటించడం ఎంత పెద్ద చాలేంజో మూవీకి సైన్ చేశాకే తెలిసింది. కొన్నేళ్ల క్రితం మిథాలి గురించి పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూశా. ఫేవరేట్‌‌‌‌‌‌‌‌ మేల్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరు అని మీడియా అడిగినప్పుడు ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ ఆన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాకు నచ్చింది. తన గురించి, ఉమెన్ క్రికెట్‌‌‌‌‌‌‌‌ గురించి అప్పటివరకు నాకు తెలియనందుకు గిల్టీగా ఫీలయ్యా. ఈ సినిమాకి ఓకే చెప్పడానికి అది కూడా ఓ కారణం. చిన్నప్పుడు బాస్కెట్ బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్, లాంగ్ జంప్ లాంటి చాలా ఆటలు ఆడా. కానీ క్రికెట్ ఆడలేదు. ఈ సినిమా కోసం ప్రాక్టీస్ చేసేటప్పుడు... చిన్నప్పుడు క్రికెట్ కూడా ఆడుంటే బాగుండేదని ఫీలయ్యేదాన్ని. చూడ్డానికి వేర్వేరుగా కనిపిస్తాం కానీ మా ఇద్దరి ఐడియాలజీ ఒకటే. జీవితంలో ఏం కావాలి, ఏం వద్దు అనే విషయంలో ఇద్దరం చాలా క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాం. నలుగురు కోచ్‌‌‌‌‌‌‌‌లు నాకు క్రికెట్ నేర్పారు. మిథాలీలాగే మొదట బ్యాట్‌‌‌‌‌‌‌‌ పట్టుకోవడం, తర్వాత మిథాలీ ఫేమస్ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ నేర్చుకున్నాను. ఇది తన పర్సనల్‌‌‌‌‌‌‌‌ జర్నీ కాదు. ఇండియన్ ఉమెన్ క్రికెట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ జర్నీ. ఈ ఇరవయ్యేళ్లలో వారి అప్‌‌‌‌‌‌‌‌ అండ్ డౌన్స్‌‌‌‌‌‌‌‌ అన్నీ ఉంటాయి. నిజానికి నేను తెలుగు సినిమాలు మిస్ అవుతున్నా. మంచి అవకాశాలొస్తే చేయడానికి రెడీ’ అని చెప్పింది. ‘నా పాత్రలో తాప్సీ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూసిన కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ షాట్ నాకు చాలా నచ్చింది. క్రికెట్ అనేది తన డొమైన్ కాకపోయినా క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మెప్పించే ప్రయత్నం చేసింది. నేనే యాక్ట్ చేయొచ్చు కదా అన్నారు కొందరు. సినిమాల్లో నటించాలని నాకెప్పుడూ అనిపించలేదు. అది నా కప్ ఆఫ్ టీ కాదు’ అన్నారు మిథాలీ రాజ్.