ఎమ్మెల్యే మీటింగ్​లో కుర్చీలేక నిలబడ్డ తహసీల్దార్

V6 Velugu Posted on Jul 30, 2021

  •     గంటన్నరపాటు నిలబడ్డ ఆఫీసర్​
  •     సోషల్ ​మీడియాలో వైరలైన వీడియో

దేవరకొండ, వెలుగు: రేషన్​ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పెద్ద​అడిశర్లపల్లి మండల తహసీల్దార్​ దేవదాస్​కు తీవ్ర అవమానం జరిగింది. ఈ నెల 27న మండల కేంద్రంలో జరిగిన రేషన్​ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే రవీంద్రకుమార్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజీపై మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే అనుచరులు ప్రొటోకాల్​ లేకున్నా కూర్చున్నారు. దీంతో కుర్చీ లేక తహసీల్దార్ ​దేవదాస్​ స్టేజీ మీద కార్యక్రమం అయిపోయేవరకు అలాగే నిల్చుండిపోయారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టడంతో వైరలైంది. తహసీల్దార్​ దళితుడు అయినందునే ప్రజాప్రతినిధులు ఇలా అవమానానికి గురి చేశారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. 

Tagged NALGONDA, Tahasildar Devdas standing, no chair PeddaAdisharlapally mandal

Latest Videos

Subscribe Now

More News