తాజ్‌‌‌‌జీవీకే ప్రాఫిట్‌‌‌‌ రూ.24.21 కోట్లు

తాజ్‌‌‌‌జీవీకే ప్రాఫిట్‌‌‌‌ రూ.24.21 కోట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తాజ్‌‌‌‌జీవీకే  హోటల్స్‌‌‌‌ అండ్ రిసోర్ట్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌కు డిసెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్యూ3) లో  రూ.24.21 కోట్ల నికర లాభం ( స్టాండ్ ఎలోన్‌‌‌‌) వచ్చింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.17.32 కోట్ల ప్రాఫిట్‌‌‌‌ను కంపెనీ  ప్రకటించింది.

రెవెన్యూ రూ.105.56 కోట్ల నుంచి రూ.111.93 కోట్లకు పెరగగా, కంపెనీ ఇబిటా (ట్యాక్స్‌‌‌‌లు, వడ్డీలు వంటివి చెల్లించక ముందు లాభం) రూ.33.26 కోట్ల నుంచి రూ.41.15 కోట్లకు మెరుగుపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో తాజ్‌‌‌‌జీవీకే  హోటల్స్‌‌‌‌ రూ.48.55 కోట్ల నికర లాభం సాధించింది.