తేజిందర్‌‌‌‌, పారుల్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌..సిల్వర్‌‌‌‌ నెగ్గిన శైలీ సింగ్‌‌‌‌

తేజిందర్‌‌‌‌, పారుల్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌..సిల్వర్‌‌‌‌ నెగ్గిన శైలీ సింగ్‌‌‌‌

బ్యాంకాక్‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌ షాట్ పుట్టర్‌‌‌‌ తేజిందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ తూర్‌‌‌‌ ఆసియా అథ్లెటిక్స్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తన టైటిల్‌‌‌‌ నిలబెట్టుకున్నాడు.  3000 మీటర్ల స్టీపుల్‌‌‌‌ఛేజ్‌‌‌‌లో  పారుల్‌‌‌‌ చౌదరి తొలి గోల్డ్‌‌‌‌ నెగ్గింది.  శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌ షాట్‌‌‌‌ పుట్‌‌‌‌ ఫైనల్లో తేజిందర్‌‌‌‌ రెండో ప్రయత్నంలో గుండును 20.23 మీటర్ల దూరం విసిరి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ సాధించాడు. దాంతో, ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నిలబెట్టుకున్న మూడో అథ్లెట్‌‌‌‌గా నిలిచాడు.  అయితే, ఈ ఈవెంట్‌‌‌‌లో తూర్‌‌‌‌ గాయపడ్డాడు. రెండో త్రో తర్వాత గజ్జల్లో నొప్పితో ఇబ్బంది పడి పోటీ నుంచి తప్పుకున్నాడు. అయితే, మిగతా అథ్లెట్లు అతని దూరం అందుకోలేకపోయారు. ఇరాన్‌‌‌‌కు చెందిన సాబెరి మెహ్దీ (19.98 మీ.), కజకిస్తాన్‌‌‌‌కు చెందిన ఇవాన్‌‌‌‌ ఇవనోన్‌‌‌‌ (19.87 మీ.) సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ నెగ్గాడు. కాగా, తూర్‌‌‌‌ గాయం తీవ్రత ఎంతో తెలియాల్సి ఉంది. అతను ఇప్పటికే వరల్డ్​ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌కు అర్హత సాధించాడు. కాగా, విమెన్స్‌‌‌‌ 3000 మీటర్ల స్టీపుల్‌‌‌‌ఛేజ్‌‌‌‌ను  పారుల్‌‌‌‌  9 నిమిషాల38.76 సెకండ్లలో పూర్తి చేసి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ సాధించింది. విమెన్స్‌‌‌‌ లాంగ్‌‌‌‌ జంప్‌‌‌‌లో యంగ్‌‌‌‌ స్టర్‌‌‌‌ శైలీ సింగ్‌‌‌‌ 6.54 మీటర్లతో సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో సిల్వర్‌‌‌‌ గెలిచింది.