జపాన్ ప్రధానిగా తకైచి.. బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ

జపాన్ ప్రధానిగా తకైచి.. బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ

టోక్యో: జపాన్ ​ప్రధానిగా సనై తకైచి బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార పార్టీ మెజార్టీ సాధించలేదు.

 అంతకుముందు దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోయింది. దీంతో ఇషిబా రాజీనామా చేశారు. ఈమేరకు శనివారం లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన ఎన్నికల్లో తకైచి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తర్వాతి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

తొలి మహిళా ప్రధానిగా రికార్డ్​ నెలకొల్పనున్నారు. కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు జపాన్ పార్లమెంటు ఈ నెల 15న ఓటింగ్ నిర్వహించనుంది. 64 ఏండ్ల సనై తకైచి తన స్వస్థలం నారా నుంచి 1993లో పార్లమెంట్​కు ఎన్నికయ్యారు. ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవుల్లో తకైచి పనిచేశారు.