మార్చి 29న తలకోన మూవీ విడుదల

మార్చి 29న తలకోన మూవీ విడుదల

గ్లామరస్ రోల్స్‌‌‌‌‌‌‌‌తో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా గుర్తింపును అందుకుంది అప్సర రాణి. ఆమె ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా నటించిన చిత్రం ‘తలకోన’. నగేష్ నారదాసి దర్శకత్వంలో  విశ్వేశ్వర శర్మ, దేవర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్,  రంగ రాజన్, నటించిన ఈ  చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందించాడు. మార్చి 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కి  నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్, డీఎస్ రావు,  రమాకాంత్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. 

అప్సర రాణి మాట్లాడుతూ ‘ఈ చిత్రం నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మైలు రాయిగా నిలుస్తుందని నమ్ముతున్నా. ఇందులో ఫైట్స్ కూడా చేశా. మాస్, క్లాస్ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’ అని చెప్పింది. ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రకృతి అందాలే కాదు..  ఇంకో కోణం కూడా ఉంటుందని దర్శక నిర్మాతలు అన్నారు.